తెలంగాణ జన జాతరను విజయవంతం చేయండి
-నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్
ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
ఈ నెల 6 వ తారీఖున తుక్కగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో నిర్వహించనున్న తెలంగాణ జన జాతరను విజయవంతం చేయాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్, ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ పీసీసీ ఇన్చార్జి శివ కుమార్ కోరారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ….హస్తం అగ్రనాయకత్వం అధ్యక్షతన తెలంగాణ గడ్డపై ప్రకటించే మేనిఫెస్టో దేశ దశ దిశను మార్చనుందని స్పష్టం చేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలను ప్రకటించ నుందని తెలిపారు.
దేశంలో అందరూ ఐక్యంగా ఉండాలని రాహుల్ గాంధీ కాశీ నుండి కన్యాకుమారి భారత్ జోడో యాత్ర, జోడో న్యాయ యాత్ర చేసి కుల మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఒకే తాటిపై నడిపించారాని అన్నారు. నేడు దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ ప్రశ్నించే వారిపై దాడులు చేస్తూ రాజ్యాంగ బద్ధ సంస్థలను ఉపయోగించుకొని రాచరిక పాలన సాగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ నిరంకుశ విధానానికి తుక్క గూడ సభ నుండే చరమ గీతం పాడాలని పిలుపునిచ్చారు.
ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వేలాది సంఖ్యలో కార్యకర్తలు తరలి తెలంగాణ జన జాతర సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఖమ్మం నియోజకవర్గం పార్లమెంటరీ పీసీసీ ఇంచార్జ్ శివకుమార్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఖమ్మంకు ఎంతో ప్రాధాన్యత ఉందని అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చిన జిల్లా ఖమ్మం అని అందుకు ఖమ్మం జిల్లా వాసులకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. అదేవిధంగాదేశంలో బిజెపి విధానాలతో ప్రజాస్వామ్యం కనుమరుగవుతుందని, స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వాలను మంట కలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బిజెపిని గద్దె దించడానికి తెలంగాణ అసెంబ్లీలో ఇచ్చిన మెజారిటీని రాహుల్ గాంధీకి ఇచ్చి ప్రధానిగా చేద్దాం అని అన్నారు. నిరుద్యోగ, శ్రామిక, మహిళా, కార్మిక, కర్షక అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా మ్యానిఫ్యాస్టో రూపొందించడం జరిగింది అని అన్నారు. ఖమ్మం జిల్లా నుండి అత్యధిక మంది తరలి వచ్చి జన జాతర సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో 2 వ డివిజన్ కార్పొరేటర్ మలీదు వెంకటేశ్వర్లు 8వ డివిజన్ కార్పొరేటర్ లకావత్ సైదులు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా సేవాదల అధ్యక్షుడు సయ్యద్ గౌస్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ సేల్ ఉపాధ్యక్షులు కొంటేముక్కల నాగేశ్వరరావు,ఎస్సీ సెల్ అధ్యక్షుడు నగర గడ్డి కొప్పుల ఆనందరావు సీనియర్ మాజీ కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు, బొమ్మిడి శ్రీనివాస్ యాదవ్,ఎన్ ఎస్ యు ఐ నగర అధ్యక్షుడు పేరం యశ్వంత్, మహిళ నాయకురాలు కొత్తపల్లి పుష్ప డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP