పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తధ్యం : ఎం.ఎల్.ఏ. లు, నేతల ధీమా
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయ సమావేశాలు
సాక్షితసికింద్రాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీ.ఆర్.ఎస్. పార్టీ కైవసం చేసుకోనుందని, పార్టీ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ భారీ ఆధిక్యతతో విజయం సాధించడం ఖాయమని నగరానికి చెందిన బీ.ఆర్.ఎస్.పార్టీ ఎం.ఎల్.ఏ.లు, నేతలు పేర్కొన్నారు. సికిన్దేరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీ.ఆర్.ఎస్.పార్టీ నేతల సమన్వయ సమావేశం మంగళవారం మాజీ మంత్రి, సనత్ నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆద్వర్యంలో మారేడుపల్లి లోని ఆయన నివాసంలో జరిగింది. పార్లమెంట్ అభ్యర్ధి, సికింద్రాబాద్ శాసనసభ్యుడు తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ సమావేశంలో పార్టీ నగరధ్యక్షుడు, జూబ్లి హిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపినాద్, శాసనమండలి సభ్యుడు ఎం.ఎస్.ప్రభాకర్, అంబర్ పేట శాసనసభ్యుడు కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ శాసనసభ్యుడు ముఠా గోపాల్, , సీనియర్ నేతలు డాక్టర్ దసోజు శ్రవణ్, విప్లవ్ కుమార్, మన్నే గోవర్ధన్, ఆనంద్ గౌడ్, వెంకటేష్, మన్నే కవిత, ముఠా జైసింహ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఎం.పీ. ఎన్నికల్లో చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలు, పార్టీ శ్రేణుల ద్వారా ప్రజలకు బీ.ఆర్.ఎస్. విధానాలను చేరువ చేసిందుకు చేపట్టాల్సిన చర్యల పై సమగ్రంగా చర్చించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జంటనగరాల్లో బీ.ఆర్.ఎస్.ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, నిర్వహించిన సంక్షేమ కార్యక్రమలు ప్రజలకు విపులీకరించాలని సూచించారు. ఎంపీ అభ్యర్ధిగా సికింద్రాబాద్ ఎం.ఎల్.ఏ.పద్మారావు గౌడ్ పేరును ప్రకటించి, ప్రచార పర్వం ప్రారంభించిన వెంటనే ప్రజల్లో మంచి స్పందన లభించినట్లు సమావేశంలో ప్రసంగించిన నేతలు వివరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలోని వివిధ నియోజకవర్గాల నుంచి బీ.ఆర్.ఎస్. పార్టీకి లక్షా 83 వేల ఓట్ల ఆధిక్యత లభించిందని, తాజా ఎం పీ ఎన్నికల్లో ఈ ఓట్లు తిరిగి సాధించడం ఖాయమని నేతలు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. బుధవారం (ఈ నెల 3 వ తేదీ) నుంచి నగరంలోని అన్ని శాసనసభా నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. బీ.ఆర్.ఎస్. ఎం.ఎల్.ఏ లు ప్రాతినిధ్యం వహిస్తున్న జుబ్లీ హిల్స్, సికింద్రాబాద్, సనత్ నగర్, ముషీరాబాద్, అంబర్ పెట్, నియోజకవర్గాల్లో ఆయా ఎం ఎల్ ఏ ల ఆద్వర్యంలో ఈ సమావేశాలు జరుగుతాయి. ఖైరతాబాద్ లో డాక్టర్ దసోజు శ్రవణ్, మన్నే గోవర్ధన్ రెడ్డి , విప్లవ కుమార్ ల ఆద్వర్యంలో, నాంపల్లి లో ఎం ఎల్ సీ ఎం.ఎస్.ప్రభాకర్, ఆనంద్ గౌడ్ ల అద్వర్యంలో ఈ సమావేశం నిర్వహిస్తారు. 3 వ తేదిన జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలో, నాలుగో తేదిన సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో, 5 వ తేదీన ముషీరాబాద్ లో , ఆరో తేదిన సనత్ నగర్ లో, 7 వ తేదీన ఖైరతాబాద్ లో, 8వ తేదీన నాంపల్లి లో, 10 వ తేదిన అంబర్ పెట్ లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను ఎన్నికలకు కార్యోన్ముఖులు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.