శంకర్‌పల్లి: మార్చి 31: ( సాక్షిత న్యూస్): నేటి నుండి వీధి వ్యాపారస్తులు చెల్లించవలసిన తై బజార్ ఫీజును మున్సిపాల్టీకి చెల్లించాలని కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ తై బజార్ ఫీజు తీసుకునే కాంట్రాక్టర్ గడువు మార్చి 31 ఆదివారంతో ముగిసిందన్నారు. వీధి వ్యాపారస్తులందరూ కాంట్రాక్టర్ కు ఫీజు చెల్లించవద్దని కోరారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి మున్సిపల్ సిబ్బంది వారిచే తై బజార్ ఫీజు వసూలు చేయబడునని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రతిపాదనలు కలెక్టర్ కు పంపామని, కలెక్టర్ కార్యాలయం నుండి ఆదేశాలు వచ్చే వరకు మున్సిపల్ సిబ్బంది తై బజార్ ఫీజు వసూలు చేయబడునని తెలిపారు. ఈ విషయాన్ని వీధి వ్యాపారస్తులందరూ గ్రహించి మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరారు.
శంకర్‌పల్లి వీధి వ్యాపారస్తులకు ముఖ్య గమనిక: మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్
Related Posts
ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా మత్స్యకార సోదరులందరికీ శుభాకాంక్షలు
SAKSHITHA NEWS _*కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో మత్స్యకారులందరికీ మంచి రోజులు వచ్చాయని మత్స్యకారుల అభివృద్ధి కోసం*_ _*ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ,*_ _*మత్స్యకార కుటుంబాలను BC D గ్రూప్ నుంచి A గ్రూప్ లోనికి…
మున్సిపల్ కార్మికుల బకాయి
SAKSHITHA NEWS మున్సిపల్ కార్మికుల బకాయి వేతనాలుచెల్లించాలన కార్యాలయం ఎదుట సిఐటియు ధర్నాసాక్షిత వనపర్తి వనపర్తి మున్సిపల్ కార్మికులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో గురువారం కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా నిర్వహించడం…