ప్రపంచ మేధాశక్తిలో పురుషులకు దీటుగా మహిళలు.. పట్నం సునీత మహేందర్ రెడ్డి. స్త్రీ శక్తి లేనిదే సమాజం ముందుకు సాగదు. రాగిడి లక్ష్మారెడ్డి. ప్రతి మగవారి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది ఈటెల జమున రాజేందర్. పద్మశాలీలకు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ వాటా కల్పించాలి. వనం దుశ్శాంతల. పద్మశాలీలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలి ..బొమ్మ ప్రవల్లిక. కీసర నాగారం. ప్రపంచ మేధాశక్తిలో పురుషులకు దీటుగా మహిళాలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి పేర్కొన్నారు . మహిళలు పురుషులతో సమానమని స్త్రీ శక్తి లేనిదే సమాజం ముందుకు సాగదని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.. ప్రతి మగవారి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందని ప్రముఖ సంఘ సేవకురాలు ఈటెల జమున రాజేందర్ పేర్కొన్నారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు బొమ్మ ప్రవల్లిక ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలోని సువర్ణ కళ్యాణ వేదికలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రముఖ సంఘ సేవకురాలు జమున రాజేందర్లు, అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు వనం దుశ్శాంతల జాతీయరాజకీయ అధ్యక్షులు బోల్ల శివశంకర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు
సందర్భంగా పద్మశాలి కుల దైవం మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ
ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ* ప్రపంచ మేధాశక్తిలో పురుషులకు దీటుగా మహిళా శక్తి మణులు దూసుకుపోతున్నారని పేర్కొన్నారు. పద్మశాలి కుల బంధువులతో తనకు ఆత్మీయమైన అనుబంధం ఉందని పద్మశాలీల సంక్షేమానికి గతంలో కృషి చేశానని మళ్లీ ఎంపీగా గెలిస్తే పద్మశాలీల ప్రతి సమస్యను తీర్చేందుకు కృషి చేస్తానన్నారు
ప్రతి కుటుంబం ఎదుగుదలలో ఆ ఇంటి స్త్రీ పాత్ర ప్రముఖంగా కన్పిస్తుందన్నారు నేడు సామాజికంగా ఆర్థికంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు
ఫ్రపంచ ఆర్ధిక పురోభివృద్ధి లో మహిళల పాత్ర గణనీయమైనదన్నారు
మహిళామణులు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన, పేరుప్రఖ్యాతులు సాధిస్తున్నారన్నారు మహిళలను స్పూర్తిగా తీసుకుని ఉక్కు మహిళలుగా ఎదగాలని
కుటుంబమైనా, దేశమైనా ఆర్ధికంగా, సామాజికంగా ఇంకా బలపడాలంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఒక మహిళగా తనకు పార్లమెంట్ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి అవకాశం కల్పించారని మహిళగా తనకు మద్దతు పలకాలని మహిళలను కోరారు. ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ వేడుకలను ఆటపాటల నృత్యాలను ప్రారంభించారు రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ. స్త్రీ పురుషుల సహకారంతోనే ఏదైనా విజయం సాధ్యమని పేర్కొన్నారు ప్రపంచ ఆర్థిక పురోగాభివృద్ధిలో మహిళల పాత్ర గణనీయమైంది అన్నారు మహిళా మణులు రాజకీయంగా ముందుకు వచ్చినప్పుడే మహిళలు ఆర్థిక స్వలంబన సాధిస్తారని ఆయన పేర్కొన్నారు పద్మశాలీలు రాజకీయంగా వెనకబడి ఉన్నారని పద్మశాలీలంతా ఐక్యంగా ఉండి పద్మశాలి సంఘ అభివృద్ధికి పాటుపడాలన్నారు రాజకీయ చైతన్యంతోనే ఏదైనా సాధ్యమని ఆయన పేర్కొన్నారు మహిళలు రాజకీయంగా అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారని మహిళలు ఎలాంటి ఆటుపోట్లయినా ఎదుర్కొని రాజకీయాల్లో ముందుకు రావాలని సూచించారు పద్మశాలీల సంక్షేమo కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు వారి ఆర్థిక అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందించిందని ఆయన గుర్తు చేశారు.
ఉప్పల్ స్థానిక అభ్యర్థిగా తనకు పద్మశాలి కుటుంబ సభ్యులతో ఎంతో మమకారమైన సాన్నిహిత్యం ఉందని పద్మశాలిల సంక్షేమం కోసం తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని రాగిడి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా పద్మశాలి సంఘం లోగోను మహిళా మణులతో కలిసి ఆవిష్కరించారు ఈటెల జమున రాజేందర్ మాట్లాడుతూ. మహిళలు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారన్నారు మహిళా మణులు రాజకీయంగా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నారన్నారు మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా ఉన్న సేవలు అందిస్తూ దేశవ్యాప్తంగా మహిళలు గుర్తింపు పొందుతున్నారని ఆమె పేర్కొన్నారు స్త్రీలు ఆరోగ్య విషయాలపై పలు సూచన సలహాలతో ఐక్యత ఉంటే ఏదైనా సాధ్యమని ఆమె ఈ సందర్భంగా మహిళ లంతా కలిసి బతుకమ్మ బోనాల దీపాలను వెలిగించి బతుకమ్మ ఆడి పాడారు . ఈ సందర్భంగా మహిళా మండల్ అంతా గజమాలతో ఆమె ఘనంగా సత్కరించి మెమెంటోలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అయ్యా కాంగ్రెస్ ఇంచార్జ్ వజ్రిష్ యాదవ్ నక్క ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ. పద్మశాలీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని . పద్మశాలీల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకాలని వాళ్లు మహిళలను కోరారు ఈ సందర్భంగా సిరి రాంకుమార్ చిన్నారి చేసిన నృత్యం అందరినీ అమితంగా ఆకట్టుకుంది మ్యూజికల్ చైర్స్ త్రో బాల్ కుషన్ గేమ్ పిరమిడ్ పలు ఆట పోటీలను నిర్వహించారు ఈ ఆట పోటీల్లో మహిళలు ఎంతో ఉత్సాహవంతంగా నృత్యాలు చేస్తూ. కేరింతలు వేస్తూ ఎంతో ఉత్సాహభరితంగా ఆట పోటీలలో పాల్గొన్నారు అనంతరం వివిధ అంశాల్లో ఆట పోటీల్లో గెలుపొందిన మహిళలకు వనం దుశ్శoతల, వర్ణ లీలల ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు అందజేశారు
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో, అఖిలభారత పద్మశాలి జాతీయ మహిళా అధ్యక్షురాలు వనం దుశ్శాంతల, కోశాధికారి మిరియాల విశ్వ రేఖ, ఉపాధ్యక్షులు బండారు లక్ష్మి, పోట్టపత్తిని అరుణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళ పద్మ దమ్మయిగూడ మున్సిపాలిటీ చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ టిపిసిసి జనరల్ సెక్రటరీ గోగుల సరిత,మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మచ్చ వరలక్ష్మి,ఏ బ్లాక్ అధ్యక్షురాలు బద్దినేని అనంత లక్ష్మి నాగారం కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి ,దమ్మాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాసరెడ్డి,, యూత్ అధ్యక్షులు మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ వరిగంటి వెంకటేష్ , యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సోమేష్, తదితరులు పాల్గొన్నారు