హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు

Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువును నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ తో, మరియు 8 వ వార్డు కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ చెరువు అపరిశుభ్రం వలన, పేరుకుపోయిన గుర్రపు డెక్క వలన దోమలు పెరిగి స్థానికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు అంబీర్ చెరువును పరిశీలించడం జరిగిందని దోమల నివారణ, డెంగ్యూ, మలేరియా రోగాల నుంచి ప్రజలను రక్షించేందుకు, దుర్వాసన సమస్యను పరిష్కరించేందుకు అంబీర్ చెరువులో గుర్రపు డెక్కను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో తో అంబీర్ చెరువును అత్యంత సుందరంగా తీర్చి దిద్దుతామని, చెరువులో కలుషిత నీరు చేరకుండా, కబ్జాలకు గురి కాకుండా పూర్తి స్థాయిలో సంరక్షిస్తామని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేశారు. అదేవిధంగా చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని, చిన్న పిల్లలు ఆడుకునేందుకు ఆట పరికరాలను మరియు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నవీన్ నాయుడు, ధర్మ రెడ్డి, వేణు గోపాల్ రాజు, రమేష్, శివ, మనోహర్, రఘు, రాము, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page