అన్ని జిల్లా కేంద్రాలలో ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి: టీఎస్ జెఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి
రాష్ట్రవ్యాప్తంగా అన్ని సౌకర్యాలతో కూడిన ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి,రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.శనివారం జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏవో సుదర్శన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ ఎటువంటి వేతనాలు లేకుండా 24 గంటలు ప్రజలకు ప్రభుత్వానికి ఉచితంగా సేవ చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ హెల్త్ కార్డులు పోలీస్ భరోసా కార్డులు ఇవ్వాలన్నారు.ఇంతే కాకుండా ప్రతి జర్నలిస్టుకు ప్రతిరోజు లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇచ్చే విధంగా ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ప్రతి జర్నలిస్టు ఇంటికి ఉచిత విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు నిలువ నీడ లేని పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.దీన్ని దృష్టిలో ఉంచుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలో పాత మార్కెట్ యార్డు లో గల మిర్చి యార్డులో 500 గజాల స్థలం కేటాయించి అన్ని రకాల సౌకర్యాలతో జర్నలిస్టు భవనాన్ని నిర్మించాలని కోరారు.