పరకాల నుండి ఎర్రగట్టు గుట్ట రోడ్
కంఠాత్మకూర్ వాగుపై రూ.10 కోట్లతో ఫోర్ లైన్ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ హనుమకొండ పరకాల రెండు జాతీయ రహదారులు కలుపుతూ వెళ్ళే రోడ్ కంఠాత్మకూర్ వద్ద గల వాగు వల్ల వర్శా కాలంలో రవాణ వ్యవస్థ దెబ్బతిని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పదుతున్నారని గత10సంవత్సరాల క్రితం నుండి ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం 7కోట్లతో డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణానికి అప్పటి ఎం ఎల్ ఏ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం కూడా చేయలేదని అన్నారు
తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పరకాల ప్రాంత అభివృద్ధిని కోసం కంఠాత్మకూర్ వాగుపై రాబోయే 50 సంవత్సరాల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాగుపై ఫోర్ లైన్ హైలెవల్ బ్రిడ్జి అవసరమని గుర్తించి అధికారులతో చర్చించి అందుకు అవసరమయ్యే నిధులు రూ.10 కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు సంబంధిత శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి మంజూరి కోరుతూ విజ్ఞప్తి చేయడం జరిగినదని వెంటనే వారు మంజూరి ఇచ్చారని ఎమ్మెల్యే అన్నారు త్వరలో పనులు ప్రారంభించాలని అధికారును ఆదేశించామని ఆయన అన్నారు.
ఇక్కడ బ్రిడ్జి లేక అనేకమంది ప్రమాదాలకు గురైనారని మా చిరకాల కోరిక నెరవేరనున్నదని ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఫోర్ లైన్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు తీసుకుని వచ్చి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం పట్ల కంఠాత్మకూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP