కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ తోపాటు బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.. ముఖ్యాంశాలు….
మీడియా స్క్రోలింగ్ పాయింట్స్….
కేసీఆర్ ను తెలంగాణ సమాజం చీత్కరించినా బుద్దిరాలేదు.. పచ్చి అబద్దాలు, అభూతకల్పనలతో మళ్లీ ప్రజలను నమ్మించే యత్నం చేస్తున్నారు.
*బీఆర్ఎస్ కు అభ్యర్ధులే కరువయ్యారు. ఆ పార్టీలోని నేతలంతా ఇతర పార్టీలవైపు చూస్తున్నారు… *
*భద్రాచలంలోని 7 మండలాలను ఏపీలో విలీనానికి ఓకే చెప్పిందే కేసీఆర్… *
అఫ్ట్రాల్ 7 మండలాలు పోతేపోనీ… తెలంగాణ వస్తుంది కదా అన్నదే కేసీఆర్
పాత అంశాలను తోడి సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు కేసీఆర్ కు కుట్ర
*వినోద్ కుమార్ నిజాయితీపరుడైతే రూ.500 కోట్ల విలువైన భూదాన్ భూముల స్వాధీనంపై కేసీఆర్ నోరెందుకు మెదపలేదు? *
బోయినిపల్లిలో భూముల కొనుగోలు వ్యవహారంపై ఎందుకు నోరు మెదపలేదు?
కేసీఆరే పెద్ద అవినీతిపరుడు…కేంద్ర మంత్రిగా ఈఎస్ఐ, సహార కుంభకోణాల్లో భాగస్వామి
ఇదిగో ఈఎస్ఐ, సహారా స్కాంలపై కేసీఆర్ పాత్రపై మీడియాలో వచ్చిన వార్తలివే.
నీ అవినీతి నాటి ప్రధానికి తెలియడంతో నిన్ను రాజీనామా చేయాలని నాడు మన్మోహన్ సింగ్ చెప్పింది నిజం కాదా?
ఆనాడు 2 రోజుల గడువు కోరి కేబినెట్ నుండి బయటకొచ్చి తెలంగాణ కోసం రాజీనామా చేశానని డ్రామాలాడింది నిజం కాదా?
నీ పాలనలో కరీంనగర్ లో బీఆర్ఎస్ నేతలు చేసిన అరాచకాలు, భూకబ్జాల భాగోతం తెలియదా?
నేడు వారి భూభాగోతాలు వెలుగులోకి రావడంతో 6గురు కార్పొరేటర్లను జైలుకు పంపింది నిజం కాదా?
స్మార్ట్ సిటీ నిధులు కేసీఆర్ ఇచ్చిండా?… కేంద్రం కదా మంజూరు చేసింది
కేంద్రం స్మార్ట్ సిటీ కింద కేంద్రం రూ.196 కోట్లు మంజూరు చేస్తే రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ కింద అదనంగా రూ.196 కోట్లు ఆనాడు ఎందుకు విడుదల చేయలేదు?
స్మార్ట్ సిటీ నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లిస్తే నేనే కేంద్రానికి ఫిర్యాదు చేసిన
వెంటనే కేంద్రం స్మార్ట్ సిటీ నిధులను ఎందుకు డైవర్ట్ చేశారంటూ 2019, 2020 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది
కేంద్ర ప్రభుత్వం నాడు రాష్ట్రానికి లేఖలను మీడియాకు విడుదల చేసిన బండి సంజయ్
*తక్షణమే ఆ నిధులను జమ చేయకపోతే వడ్డీతోసహా వసూలు చేస్తామని కేంద్రం హెచ్చరించిన మాట వాస్తవం కాదా? *
పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఇదే విషయంపై నాటి మున్సిపల్ శాఖ అధికారులను నేనే నిలదీసిన
వారం రోజుల్లో ఆ నిధులను జమ చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి కేంద్ర నిధులను విడుదల చేయడంతోపాటు రాష్ట్ర వాటాను జమ చేసింది నిజం కాదా?
బండి సంజయ్ పక్కా లోకల్… నాకే మాట్లాడే హక్కుంది. పోటీ చేసే హక్కుంది.
అపర మేధావి(వినోద్ కుమార్) వలస పక్షి… కేసీఆర్ కుటుంబానికి దోచిపెట్టడం, దోచుకోవడమే ఆయన పని
లక్ష ఓట్లతో లక్షణంగా ఓడిపోయిన చరిత్ర వినోద్ కుమార్ ది
కేసీఆర్ ముఖాన్ని జనం ఛీత్కరించారు.. వినోద్ ముఖానికి ఓట్లు పడే పరిస్థితి లేదు
పార్లమెంట్ లో 106 సార్లు మాట్లాడి వినోద్ కుమార్ సాధించేదేమిటి?
కరీంనగర్ -వరంగల్, కరీంనగర్-జగిత్యాల, ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణకు నిధులెందుకు తీసుకురాలేదు?
ఆ రోడ్ల విస్తరణ కోసం కేంద్రాన్ని ఒప్పించి దాదాపు రూ.5 వేల కోట్ల నిధులను నేను తీసుకొచ్చిన
తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణానికి కూడా నిధులెందుకు తీసుకురాలేకపోయావ్?
నేను ఎంపీగా గెలిచిన వెంటనే తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణం ప్రతిపాదనలు పంపితే కేసీఆర్ తొక్కిపెట్టింది నిజం కాదా?
నేను లోకల్ కాబట్టే కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి సంబంధించిన నేషనల్ హైవే ఫైల్స్ అన్నీ ఆపించిన.
తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణ ప్రతిపాదనలకు కేసీఆర్ ఆమోదం తెలిపిన తరువాతే ఫైల్స్ అన్నీ క్లియర్ చేయించిన
ఆ తరువాత కూడా తీగలగుట్టపల్లి ఆర్వోబీకి నిధుల మంజూరులో ఏళ్ల తరబడి బీఆర్ఎస్ ప్రభుత్వం జాప్యం చేసింది నిజం కాదా?
పార్లమెంట్ లో మాట్లాడినట్లు గప్పాలు కొడుతున్న వినోద్ శాతవాహన వర్శిటీకి 12బీ హోదా, ఎస్సారార్ కాలేజీకి అటానమస్ హోదా ఎందుకు తీసుకురాలేదు?
బండి సంజయ్ ఎంపీ అయ్యాక ఎన్ని పోరాటాలు చేసిండో తెలంగాణ ప్రజలను అడుగు వినోద్ కుమార్
మీలెక్క ఏనాడూ కన్పించకుండా పోలే.. కేసీఆర్ లెక్క ఫాంహౌజ్ లో పడుకోలేదు.. మీ లెక్క దోచుకోలేదు
ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ కేసీఆర్ సర్కార్ ను గజగజలాడించిన చరిత్ర బండి సంజయ్ ది
పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెడితే హాజరుకాకుండా తాగి పండి దొంగ సంతకాలు పెట్టించిన నీచ చరిత్ర కేసీఆర్ ది
పార్లమెంట్ లో ఎంపీగా కేసీఆర్ ఎన్నిసార్లు వెళ్లారో… నేను ఎన్నిసార్లు వెళ్లానో చర్చించే దమ్ముందా?
తెలంగాణలో 21 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చిందే కేంద్రం కాదా?
కరీంనగర్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుకున్నది మీరే కదా?
కరీంనగర్ లో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీ మీ కుటుంబానిది కాదా?
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదకరమని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక ఇచ్చింది నిజం కాదా?
అంత పెద్ద సమస్యను చిన్న సమస్యగా చిత్రీకరిస్తారా?
రూ.లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ కు ప్రతీది చిన్న సమస్యగానే కన్పిస్తుంది
కాళేశ్వరం బాధ్యుడైన కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్నడూ బూతులు మాట్లాడలేదని పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నడు
కేసీఆర్ బూత పురాణం ఇదిగో…అంటూ వీడియో విడుదల చేసిన బండి సంజయ్
రాజకీయాల్లో బూతుకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్
కేసీఆర్ అబద్దాలను, మోసాలను జనం ఇక నమ్మరు
ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడో స్థానమేబీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కేసీఆర్ ను అసహ్యించుకుంటున్నరు
బీఆర్ఎస్ తాజా మాజీ సర్పంచులంతా బీజేపీయే గెలవాలని కోరుకుంటున్నరు
మోదీ ప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధి హామీ నిధులను కేసీఆర్ దారి మళ్లించింది నిజం కాదా?పేదలకు అందించే ఉపాధి నిధులను కూడా ఇవ్వకుండా వేధించిన మాట వాస్తవం కాదా?
మీకు దమ్ముంటే… గ్రామాల వారీగా బీఆర్ఎస్ చేసిన అభివ్రుద్ది ఏమిటో వివరించే దమ్ముందా?
ఎంపీగా నేనేం చేశానో బుక్ లెట్ ఇంటింటికీ పంపిన… కేసీఆర్ కు కూడా పంపిన.. చదువుకోవాలినిన్నటి కేబినెట్ మీటింగ్ లో 6 గ్యారంటీలకు ఆమోదం తెలపకపోవడం సిగ్గుచేటు
6 గ్యారంటీల అమలుకయ్యే నిధులను ఎందుకు విడుదల చేయలేదు?
కేబినెట్ భేటీ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది
మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు రూ.2500 ఎందుకు ఇవ్వలేదు?రైతు భరోసా కింద రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఎందుకివ్వలేదు?
15 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా ఎందుకివ్వడం లేదు?
ఉజ్వల పథకం లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్ పై కేంద్రం రూ.300 సబ్సిడీ ఇస్తోంది
రాష్ర ప్రభుత్వం ఆ లబ్దిదారులకు అదనంగా రూ.500లు ఎందుకు ఇవ్వడం లేదు?
కేంద్ర, రాష్ట్రాల సబ్సిడీ కలిపి సిలిండర్ పై రూ.800 నగదు సబ్సిడీ ఇవ్వాల్సిందేఎన్నికల కోడ్ తో 6 గ్యారంటీలపై వంద రోజుల గడువు ముగియబోతోంది. ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?6 గ్యారంటీలపై ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుంది
మోదీ ప్రధానిగా లేని భారత్ ను ప్రజలు ఊహించుకోవడం లేదు
తెలంగాణలో 12 నుండి 17 ఎంపీ సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడం తథ్యంసాగునీటి విడుదలలో జాప్యం వల్ల రైతుల పంటలు ఎండిపోతున్నాయి
కొంత మంది సాగునీటి అధికారుల తీరువల్లే రైతులు నష్టపోతున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే సాగునీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి
రసమయి బాలకిషన్ వ్యాఖ్యలపై మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోలేనుకేసీఆర్ కుటుంబాన్ని తూలనాడుతూ, బీఆర్ఎస్ ను తిడుతూ రసమయి పాడిన పాటను నిన్నటి సభలో ప్లే చేస్తే బాగుండేది?రసమయి రాసలీలలు, ఇద్దరు భార్యల భాగోతం, అవినీతి, అక్రమాలపై మా పార్టీ నేతలు వివరాలు సేకరిస్తున్నారురసమయి వ్యవహారంపై మా పార్టీ నేతలు చూసుకుంటారు
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP