సిటీ సబర్బన్ మోకిల నుండి శంకర్‌పల్లి వరకు పొడిగించాలి: సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మున్సిపల్ చైర్మన్ గండేటి రాజేష్ గౌడ్
సాక్షితశంకర్‌పల్లి: శంకర్‌పల్లి నుండి మెహిదీపట్నం వరకు వెళ్లే ఆర్టీసీ సిటీ సబర్బన్ సేవలో మోకిల నుండి శంకర్‌పల్లి వరకు విస్తరించాలని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ గండేటి రాజేష్ గౌడ్ పేర్కొన్నారు. శంకర్‌పల్లిలో రాజేష్ గౌడ్ మాట్లాడుతూ శంకర్‌పల్లి మున్సిపల్ మరియు మండల కేంద్రం నుంచి చాలా మంది ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్ విద్యార్థులు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా శంకర్‌పల్లి నుంచి హైదరాబాద్ వరకు జర్నీ చేసే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు మోకిల వరకే సిటీ సబర్బన్ ఉండడంతో మరి బస్సు పాసులు తీసుకుని అవకాశం లేకుండా పోయింది.
శంకర్‌పల్లి నుంచి మోకిల వరకు కేవలం ఆరు కిలోమీటర్ల కి మెట్రో బస్సుకి రూ. 30 చెల్లించాల్సిన పరిస్థితి. కాబట్టి మోకిల నుంచి శంకర్‌పల్లి వరకు సిటీ సబర్బన్ లిమిట్ ను పెంచగలిగితే చాలా మంది విద్యార్థులకు, చిరు వ్యాపారులకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది, కానీ పురుషులకు కనీసం సబర్బన్ సిటీ సబర్బన్ లిమిట్ పెంచగలిగితే చాలా మందికి లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచనలు చేసి ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టు మోకిల వరకే ఉన్నటువంటి సౌకర్యాన్ని శంకర్‌పల్లి వరకు పొడిగించాలని రాజేష్ గౌడ్ కోరారు.