SAKSHITHA NEWS

ఖమ్మం (వ్యవసాయం ): వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించారని ఖమ్మం మార్కెట్‌లో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా పాట కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు..

మార్కెట్‌ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అయినా రైతులు శాంతించకుండా గిట్టుబాటు ధర కల్పించాలని.. అప్పటి వరకు కొనుగోళ్లు నిలిపివేయాలని, గేట్లు మూసివేయాలని డిమాండ్‌ చేశారు..

మార్కెట్‌లో ప్రస్తుతం మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జెండా పాట ధర క్వింటాల్‌కు రూ.20,800గా ప్రకటించి.. కేవలం రూ.14 వేల నుంచి రూ.16 వేల మధ్యనే వ్యాపారులు కొనుగోలు చేయడంతో రైతులు కోపోద్రిక్తులయ్యారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. వ్యాపారులతో అదనపు కలెక్టర్‌, మార్కెట్‌ శాఖ అధికారులు కొద్దిసేపట్లో చర్చలు జరపనున్నారు..

WhatsApp Image 2024 03 01 at 2.28.03 PM

SAKSHITHA NEWS