శంకర్పల్లి: చేవెళ్ళ పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మొయినాబాద్ మండల పరిధి హిమాయత్ నగర్ చౌరస్తాలో గల జెపిఎల్ గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు.
శంకర్పల్లి మండల, మున్సిపల్ కు చెందిన కాంగ్రెస్ మహిళ నాయకులు జిల్లా మహిళ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళలంతా కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. మంత్రిని కలిసిన వారిలో మండల మహిళా అధ్యక్షురాలు నాగమణి, రమ్య, ప్రత్యూష రెడ్డి ఉన్నారు.