SAKSHITHA NEWS

ఏఐటీయూసీ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఉమా మహేష్.

ఫిబ్రవరి 16 న నిర్వహించ తలపెట్టిన అఖిల భారత రైతు కార్మికుల భారత సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ నేడు కుత్బుల్లాపూర్ ఏఐటీయూసీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ నుండి ఐడీపీఎల్ వరకు ఆటో ర్యాలీ ని నిర్వహించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష,కార్యదర్శి స్వామి,శ్రీనివాస్ లు జండా ఊపి ప్రారంభించగా ఐడీపీఎల్ వద్ద జరిగిన సమావేశానికి హరినాథ్ అధ్యక్ష వహించారు.


ఈ సందర్భంగా ఉమ మహేష్, సీఐటీయూ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ బీజేపీ మోడీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ వ్యక్తులైన ఆధాని,అంబానికి లాభం చేకూరేలా చేసి రైతులను,కార్మికులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతుల లాభాలను రెట్టింపు చేస్తానని చెప్పిన మోడీ రైతుల ఖర్చులను మాత్రం రెట్టింపు చేసి ఎలాంటి ఆదాయం పెరగకుండా మరింత దిగజారేలా చేసారని, బీజేపీ తీసుకిరదాల్చిన రైతు చట్టాల వల్ల వస్తువులు బ్లాక్ మార్కెట్ ఏర్పడి రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని కావున ధరలు తగ్గాలంటే మోడీని రానున్న ఎన్నికల్లో ఓడగొట్టాలని దానికి సంకేతంగా జరిపే సమ్మె లో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరారు.


ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు రాములు,ఆటో యూనియన్ నాయకులు రాజకుమార్, ఎల్లస్వామి,పూర్ణచందర్,గోపి,ప్రభాకర్,కరుణాకర్ లు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 13 at 6.07.32 PM

SAKSHITHA NEWS