SAKSHITHA NEWS

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరం భాగస్వాములం అవుదాం

———- జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్,IPS

వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని అలాగే రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని జిల్లా ఎస్పీ శ్రీమతి రితి రాజ్,IPS పిలుపునిచ్చారు.
రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల పై రాష్ట్ర డిజిపి నిన్న విడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేయడం జరిగిందని వారి ఆదేశాల జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల (జనవరి 15 నుండి ఫిబ్రవరి 14 వరకు) జిల్లాల ప్రజలకు అవగహన కార్యక్రమం లు చేపట్టడం జరుగుతుందని అన్నారు.
జిల్లా లో గత సంవత్సరం లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 100మంది చనిపోగా 148 మంది గాయపడ్డారని , మనం చేసే చిన్న చిన్న తప్పిదాల వాళ్ల విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు అన్న విషయాన్నీ వాహనదారులు గమనించాలని కోరారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా నేడు , రేపు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించిన వారిని అభినందిస్తూ 26 వ తేది నుండి రోడ్డు భద్రతా నియమాలను పాటించకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ దరించకపోవడం, మొబైల్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం, మైనర్ డ్రైవింగ్ చేయడం, ఓవర్ స్పీడ్, రాస్ డ్రైవింగ్ చేసే వారికి వారికి జరిమానాలు విధించడం తో పాటు జరిమానాలు చెల్లించేవిధంగా పోలీస్ అధికారులు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ అన్నారు.


హెల్మెట్, షీట్ బెల్ట్ ధరించిన వారికీ పూలతో అభినందనలు
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగ పోలీస్ స్టేషన్ల అదికారులు తమ పరిధి లోని రోడ్ల పై వెళ్లే వాహనదారులు వారి భద్రతా కోసం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ హెల్మెట్, షీట్ బెల్ట్ ధరించిన వాహన దారులకు పుష్పాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వాహన దారుడు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తప్పని సరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, బయటకు వెళ్ళిన తన కోసం కుటుంబ సభ్యులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటరన్న విషయాన్ని వాహన దారులు గుర్తించాలని, అనుకొని ప్రమాదాల వల్ల కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని కావున వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని అందులో హెల్మెట్, షీట్ బెల్ట్ తప్పని సరి ధరించాలని , అతి వేగం, ర్యాస్ డ్రైవింగ్, మద్యం త్రాగి డ్రైవింగ్ చేయటం, మొబైల్స్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయటం వంటివి చేయవద్దని పోలీస్ అదికారులు వాహనదారులకు సూచించారు.

జిల్లా పోలీస్ కార్యాలయం
జోగుళాంబ గద్వాల్ జిల్లా

Whatsapp Image 2024 01 24 At 6.00.45 Pm

SAKSHITHA NEWS