శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ గా నూతనంగా నియమింపబడిన శ్రీమతి స్నేహ శబరీష్, ఐ.ఏ.ఎస్ ని కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ , హమీద్ పటేల్ ,ఉప్పలపాటి శ్రీకాంత్ , శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి ,మాజీ కార్పొరేటర్ సాయి బాబా తో మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర మరియు సంక్రాతి పర్వదినం శుభాకాంక్షలు తెలియచేసి శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి పనుల పై చర్చించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై జోనల్ కమిషనర్ తో చర్చించడం జరిగింది అని , పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడలని , గతంలో అభివృద్ధి పనులకు నెలకు డివిజన్ల వారిగా 8 కోట్లు విడుదల అయ్యేవి అని ,ఇప్పుడు 4 కోట్లు మాత్రమే మంజూరు అవుతున్నాయి అని, అవి కూడా సకాలంలో రాలేకపోతున్నాయి అని, సకాలంలో మంజూరు అయ్యేలా చూడలని , అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, వర్షాలకు గుంతలు పడితే పూడ్చలేని పరిస్థితి నెలకొంది అని , రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని ఎమ్మెల్యే గాంధీ జోనల్ కమిషనర్ శ్రీమతి స్నేహ శబరిష్ IAS దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది. ఆ
అదేవిధంగా చెరువుల సుందరికరణ, పార్క్ లు అభివృద్ధి చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, అభివృద్ధి విషయంలో అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు ఏర్పాటు కు కృషి చేయాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.