కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలే
- జీవన్ జ్యోతి బీమా యోజన 436 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల బీమా
- PM సురక్ష బీమా యోజన కింద 20రూ” బీమా చెల్లిస్తే ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్షల బీమా
- సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదంతో 2047లోపు భారత్‌ను ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పం
- రైతు వేదికలు, డంపింగ్ యార్డ్లు, స్మశాన వాటికలు, గ్రామపంచాయతీ నిర్మాణాలు కేంద్రం నిధులతోనే నిర్మాణం
- తెలంగాణలో రెండు లక్షల 65 వేల డబుల్ బెడ్ రూమ్ కేంద్ర నిధులతో నిర్మాణం
- మూడు సంవత్సరాలు,ఇంకా ఐదు సంవత్సరాలు ఉచిత రేషన్ బియ్యం ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ ది
- మేడ్చల్ కాంటెస్టడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఘట్కేసర్ ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ మరిపల్లి గూడ గ్రామం సర్పంచ్ మంగమ్మ అధ్యక్షతన వికాసి భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమము నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మేడ్చల్ కాంటెస్టడ్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఘట్కేసర్ ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి సినీ సర్టిఫికేషన్ నెంబర్ మైపాల్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని. జీవన్ జ్యోతి బీమా యోజన 436 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల బీమా అతిస్తుందని. PM సురక్ష బీమా యోజన కింద 20రూ” బీమా చెల్లిస్తే ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయలు బీమ వర్తిస్తుందన్నారు.
ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన,పోషణ్ అభియాన్, ఉజ్వల 2.0, పీఎం ఆవాస్ యోజన తదితర స్టాళ్లను సందర్శించారు.వివక్షకు తావులేకుండా సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ నినాదంతో 2047లోపు భారత్‌ను బాగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రధాని విశేష కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి పేదవారిని అభివృద్ధికీ అన్ని సదుపాయాలూ అందించాలనే ఉద్దేశంతో వివిధ విధానాలు, పథకాలను ప్రభుత్వం ప్రారంభించిందనీ, ఒక పథకానికి 100 మంది లబ్ధిదారులుంటే 100 మందికీ ఆ పథకం చేరాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా మోదీ గ్యారెంటీ వ్యాన్ గ్రామ గ్రామానికీ వెళుతోందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వ్యవసాయ అధికారులు,బ్యాంక్ సిబ్బంది, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు