రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలన్న లక్ష్యంతో వైయస్ జగన్ ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..*
పేదలకు ఆరోగ్య భరోసా.. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..
కంచికచర్ల మండలంలోని పెండ్యాల గ్రామ మండల పరిషత్ పాఠశాలలో ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ -2 క్యాంప్ ను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు సందర్శించి, వైద్యులతో మాట్లాడి.. అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యం బాగుండాలన్న లక్ష్యంతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. విద్యా, వైద్య రంగాలకు సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరచడటమే కాకుండా ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని.. పెరిగిన జనాభా, వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి గ్రామంలో వైయస్సార్ హెల్త్ సెంటర్లను నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నదే లక్ష్యమన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో వైద్య అందక పేదలు చనిపోతున్న పలు సంఘటన చూసి తన తండ్రి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరించారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి విడత విజయవంతం కావడం.. ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో.. రెండో విడతను ప్రారంభించారని వివరించారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు ..