మరింత అభివృద్ధికి మా కౌన్సిల్ కృషి చేస్తుంది – మేయర్ శిరీష
సాక్షిత : తిరుపతి అభివృద్దే ధ్యేయంగా పని చేస్తామని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడి చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో పూర్తి చేసిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ భవిషత్తులో తిరుపతి నగరం మరింత అభివృద్ది సాదించాలనే లక్ష్యంతో మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిల్, అధికారుల సహకారంతో ముందుకు వెలుతున్నామన్నారు. అన్ని వార్డుల్లో అవసరమైన రహదారుల నిర్మాణాలు, కాలువల మరమ్మత్తులు, భవనాల నిర్మాణాలు చేపట్టడం, మంచినీటి సౌకర్యం కల్పించడం జరుగుతున్నదని, అదేవిధంగా ప్రభుత్వం వైపు నుండి అర్హులైన ప్రజలకి అందాల్సిన పథకాల ప్రతిపలాలను అందేలా తగు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రాభివృద్దికి నిరంతరం పాటుపడుతున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలబడాలని ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి విజ్ఞప్తి చేసారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ తిరుపతి అభివృద్దికి మా కౌన్సిల్ సభ్యులు అందరూ సమిష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు.
సంజయ్ గాంధి కాలనీ, ఎస్.కె.పాస్ట్ పుడ్ సెంటర్ నుండి మసీదు వరకు 46.50 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును, రెడ్డిగుంట, తిరుమల రెడ్డి నగర్ నందు 30 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డులు, మురికి కాలువలను, తాతయ్యగుంట వెటర్నరీ ఆసుపత్రి వద్ద 78 లక్షలతో నిర్మించిన వార్డు సచివాలయ సముదాయాలను, రవీంధ్రనగర్ వద్ద 70 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను, డ్రైన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు ఆధం రాధాకృష్ణ రెడ్డి, ఆదం లీలావతి, దొడ్డారెడ్డి ప్రవళ్ళికా రెడ్డి, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కె.బాబు, కార్పొరేటర్లు బొకం అనీల్ కుమార్, తిరుపతి మునిరామిరెడ్డి, నరేంధ్రనాధ్, దూది కుమారి, ఎస్.ఈ మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డిఈలు విజయకుమార్ రెడ్డి, సంజీవ్ కుమార్, టౌన్ బ్యాంక్ చైర్మెన్ కేతం జయచంధ్రా రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, దేవదానం, దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి, దొడ్డారెడ్డి రెడ్డి మునిశేఖర్ రెడ్డి, మార్కెట్ మునిరామి రెడ్డి, దూది శివ, శేఖర్, చోటా భాయ్, గపూర్, రవి, చింతా భరణీ యాదవ్, రమేష్ రెడ్డి, చింతా రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.