SAKSHITHA NEWS

కుతాబుల్లాపూర్ మండలంలోని గాజులరామరం లో సర్వే నెంబర్ 342,326,307 లో 300 అక్రమ ఇండ్లను కూల్చివేసి చేతులు దులుపుకోకుండా,నాడు మునిసిపల్ సెక్రెటరీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం 3000 అక్రమ నిర్మాణాలను కూల్చివేయ్యాలని ప్రజావాణిలో పిర్యాదు చేసారు. అదే విదంగా 2022 అక్టోబర్ 20 నెలలో సర్వే నెంబర్ 329 పినాకిల్ స్థలంలో నేటి సీపీఐ MLA కునంనేని సాంబశివరావు పేద ప్రజలతో తాత్కాలిక గుడిసెలు వేస్తే అప్పటి రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు సీపీఐ నాయకులను అరెస్ట్ చేసి ప్రజలను ఖాళీ చేయించి ప్రభుత్వ భూమిని కాపడుతామని చెప్పారని, అలాంటిది నేడు కబ్జాదారులు ఇండ్లు ఎలా కట్టారని,వాటికి ఇంటి నెంబర్,కరెంట్ మీటర్లు, కొన్నింటికి పట్టాలు ఎలా ఇచ్చారని,అలా చేసిన అధికారులను సస్పెండ్ చెయ్యాలని పిర్యాదు చేసారు.

అలాగే జగతగిరిగుట్ట, లెనిన్ నగర్,మహాదేవాపురం,ఆల్విన్ కాలనీ కి విస్తరించి ఉన్న పరికి చెరువు ను పూడ్చి బస్తీలు ఏర్పాటు చేశారని,పరికి చెరువు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని వెంటనే వాటిని కాపాడాలని కోరారు. జగతగిరిగుట్ట సర్వే నెంబర్ 348/1 లో దేవాదాయ భూమి లో అనాధ ఆశ్రమం పక్కన ,రాజీవ్ గృహ కల్ప లో,పోలీస్ స్టేషన్ ఎదురుగా,భూదేవి హిల్స్ లో కూడా ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని కావున పై ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు హరినాథ్ రావ్, కిషన్,శ్రీనివాస్, ప్రవీణ్,మండల సహాయ కార్యదర్శి దుర్గయ్య, మండల నాయకులు ఇమామ్, రాజు,ఐలయ్య, చారి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 12 18 at 2.36.33 PM

SAKSHITHA NEWS