శేరిలింగంపల్లి డివిజన్ లోగల తారానగర్ తుల్జభవాని అమ్మవారి ఆలయ ఆవరణలో బుయ్య మల్లేష్ గౌడ్ స్వామి ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్వామి కి పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..స్వామివారి పడిపూజ మహోత్సవంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ప్రజలపై అయ్యప్ప స్వామి వారి కృప, చల్లని చూపు తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, రామ్ చందర్, పాండు ముదిరాజ్, గోపాల్ యాదవ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, బీమని శ్రీను, సురేష్ స్వామి, రాకేష్, లింగం శ్రీను తదితరులు పాల్గొన్నారు.