భారత రాజ్యాంగ రూపశిల్పి “డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ” 67 వ వర్థంతి సందర్భంగా. చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తో కలిసి ఆ మహనీయునీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే అరెకపూడిగాంధీ .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లడుతూ డా. బి.ఆర్ అంబేద్కర్ 67 వ వర్ధంతి సందర్బంగా ఆహా మహనీయుడికి ఘన నివాళ్ళర్పిస్తున్నాం అని , అదేవిదంగా రాజ్యాంగ సృష్టి కర్త మరియు మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,భారత రాజ్యంగ నిర్మాత, ఆర్థిక వేత్త ,న్యాయ కోవిందుడు, రాజనీతిజ్ఞుడు,ప్రపంచ మేధావి ,దేశానికి దశ ,దిశ చూపిన మహానుభావుడు, ప్రపంచానికి మన రాజ్యాంగం ఒక రోల్ మోడల్ అని,సమానత్వం కోరకు,అందరికి సమానత్వం ఉండాలని,అంటరానితనం,అసమానతలు, వివక్షాల పై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు,కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపి అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత మూర్తి, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్.డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రాసిన పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగా ఉంది అని సమ సమాజ స్థాపన కోసం, సమానత్వం కోసం ఆయన కృషి ఎనలేనిది.చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ది సాధ్యం అని చెప్పింది డాక్టర్ బీ.ఆర్ అంబేద్కరే.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాటలోనే పయనించి దశాబ్దాల తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సాకారం చేసుకున్నాం.
పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ,భారత రత్న డాక్టర్ అంబేద్కర్ దేశం కోసం ఎంతో కృషి చేశారని, రాజ్యాంగం రాసి నవ భారత నిర్మాణ అధ్యడు అని, సంక్షేమ పథకాలు ప్రతి పేద ప్రజలకు అందుతున్నావంటే అది బి ర్ అంబెడ్కర్ మనకు కలిపించిన హక్కు అని ,దేశ విదేశాలు తిరిగి రాజ్యాంగాని రచించిన మేధావి ,ఆయన ఆశయాలను ,ముందుకు తీసుకుపోయి భవిషత్తు తరాలకు తెలియచెయ్యాల్సిందిగా మనఅందరి బాధ్యత అని ఆయన ఆశయాలను సాధిద్దాం అని, అందుకు ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం ,స్ఫూర్తిదాయకం అని, ఆయన చూపిన బాటలో యువత పయనించాలని నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు