SAKSHITHA NEWS

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. జర్నలిస్టులను సెక్రటేరియట్‌లోకి అనుమతించాలని సూత్రపాయంగా డిసైడ్ చేసింది. ప్రభుత్వం ఏర్పడగానే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. కొత్త సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జర్నలిస్టు అధ్యయన వేదిక నేతలు వేణుగోపాల్ రెడ్డి, సాదిక్‌లు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సచివాయంలో జర్నలిస్టులకు ఎంట్రీ లేదు.

బీఆర్కే భవన్‌లో తాత్కాలిక సెక్రటేరియట్ కొనసాగినప్పుడు, ఆ తర్వాత కొత్త సచివాలయంలో ఓపెన్ అయినప్పుడు కూడా ప్రవేశం లేదు. సచివాలయం బయటే ఒక హాల్‌లో మీడియా పాయింట్‌ను ఇచ్చారు. దీంతో చాలా మంది రిపోర్టర్లు తమకు ఎంట్రీ ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని కోరినా లైట్ తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ పవర్‌లోకి రాగానే జర్నలిస్టులకు శుభవార్త చెప్పడం గమనార్హం

Whatsapp Image 2023 12 05 At 12.28.25 Pm

SAKSHITHA NEWS