SAKSHITHA NEWS

“రైతు ద్రోహి సోమిరెడ్డి – మంత్రి కాకాణి”

…..

“సాక్షిత : గత ప్రభుత్వంలో సోమిరెడ్డి రైతులకు తీరని ద్రోహం చేశాడు – మంత్రి కాకాణి”

“అర్హులైన పేదలకు, రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తుంటే సోమిరెడ్డి కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు – మంత్రి కాకాణి”

“పేదలకు భూములు పంపిణీ చేస్తుంటే సోమిరెడ్డి కడుపు మండిపోతోంది – మంత్రి కాకాణి”

“అభివృద్ధి పనులకు సోమిరెడ్డి అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నాడు – మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి తాత – ముత్తాతలు దిగివచ్చినా సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోలేరు – మంత్రి కాకాణి”

“మంత్రి కాకాణి చేతుల మీదగా తోటపల్లి గూడూరులో అర్హులైన రైతులకు పట్టాల పంపిణీ”

“జిల్లావ్యాప్తంగా సుమారు 6,500 ఎకరాలకు పట్టాలు పంపిణీ – మంత్రి కాకాణి”

“ఒక్క సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల్లో 5,023 ఎకరాలకు పట్టాల పంపిణీ – మంత్రి కాకాణి”

“ప్రతి అడుగులోనూ అన్నదాతకు మేలు చేసే కార్యక్రమాలే చేపడుతున్నాం – మంత్రి కాకాణి”

“రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సర్వేపల్లి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం – మంత్రి కాకాణి”

“రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ, దేశానికే ఆదర్శంగా పరిపాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రొసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి “

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

“సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లిగూడూరు ఎంపీడీవో కార్యాలయంలో తోటపల్లిగూడూరు మండలానికి సంబంధించి అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు, చుక్కల భూములకు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిన భూములకు సంబంధించి 247 మంది లబ్ధిదారులకు చెందిన 172 ఎకరాలకు పట్టాలను పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి “

ఈ సందర్భంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ….. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా, రైతులకు మంచి చేయడమే లక్ష్యంగా భూములను సాగు చేసుకుంటున్న రైతులకు రాష్ట్రవ్యాప్తంగా భూ హక్కులు కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందన్న మంత్రి కాకాణి*

గత 20 సంవత్సరాలుగా పేద రైతులు భూములను సాగు చేసుకుంటున్నారని, వారికి పట్టాలు ఇస్తే ఆ రైతు కుటుంబాలకు మేలు చేకూరుతుందన్న ఉద్దేశ్యంతో రైతుల కలను సాకారం చేస్తూ, కోట్లాది రూపాయల విలువైన భూములకు సంపూర్ణ హక్కులు కల్పించి పట్టాలు అందిస్తున్న కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగిదన్న మంత్రి కాకాణి*
జిల్లా వ్యాప్తంగా సుమారు 6,500 ఎకరాలకు పట్టాల పంపిణీ చేపట్టగా, అందులో ఒక్క సర్వేపల్లి నియోజక వర్గ పరిధిలోని 5 మండలాల్లో 5,023 ఎకరాలకు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపిన మంత్రి కాకాణి*
తోటపల్లి గూడూరు మండలంలో 51 మంది రైతులకు 20.99 సెంట్ల భూములకు డీకేటి పట్టాలు, రెండో విడతలో 54 ఎకరాల చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి 48 మంది రైతులకు పట్టాలు, ఎస్సీ కార్పొరేషన్ భూమి కొనుగోలు పథకం ద్వారా భూములు పొందిన 148 మంది ఎస్సీ, ఎస్టీలకు 97 ఎకరాల భూములకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ పట్టాలను అందజేస్తున్నట్లు వివరించిన మంత్రి కాకాణి*
కోట్లాది రూపాయల భూములకు సంబంధించి రైతులకు హక్కులు కల్పిస్తూ, వారి భవిష్యత్ తరాలకు భరోసా కల్పిస్తున్నట్లు తెలియజేసిన మంత్రి కాకాణి*
తోటపల్లి గూడూరులో ప్రధానంగా ఎన్నో దశాబ్దాలుగా ఎటువంటి హక్కులు లేకుండా భూములు సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీలకు సంపూర్ణ హక్కులు కల్పించి, కోట్లాది రూపాయల విలువ చేసే భూములను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం సాహసోపేతమైన నిర్ణయంగా చెప్పిన మంత్రి కాకాణి*
దశాబ్దాల చుక్కల భూముల సమస్యకు పరిష్కారం చూపుతూ అభ్యంతరం లేని 2 లక్షల ఎకరాలకు పైబడి ఒకే ఒక్క జీవోతో పరిష్కారం చూపడం, ఏ రాష్ట్రంలో లేనివిధంగా అసైన్మెంట్ భూములకు సంపూర్ణ హక్కులు కల్పించడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్న మంత్రి కాకాణి*
ప్రతి అడుగులోనూ అన్నదాతకు మేలు చేసే కార్యక్రమాలే చేపడుతున్నట్లు వివరించిన మంత్రి కాకాణి*
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సర్వేపల్లి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలియజేసిన మంత్రి కాకాణి*
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, స్థానిక మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల మండల అధికారులు, లబ్ధిదారులు, రైతులు పాల్గొన్నారు*

Whatsapp Image 2023 11 25 At 6.52.17 Pm

SAKSHITHA NEWS