ఆందోళనలో పోలింగ్ సిబ్బంది

Spread the love

అందని పోస్టల్ బ్యాలెట్లు…

……….

సాక్షిత : ఆందోళనలో పోలింగ్ సిబ్బంది….

ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని భయమా….

భద్రాచల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి….

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బంది, అధికారులకు రెండో లెవెల్ శిక్షణ కార్యక్రమం ముగిసినా, వారికి ఇంకా పోస్టల్ బ్యాలెట్లు అందించకపోవడంపై భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు “సరెళ్ళ నరేష్” ఈ విధంగా స్పందించారు….

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకునే హక్కును కేంద్ర ఎన్నికల కమిషన్ పోలింగ్ సిబ్బందికి కల్పించింది. పోలింగ్ శిక్షణ కేంద్రానికి పోస్టల్ బ్యాలెట్లను పంపిస్తామని అక్కడే ఓట్లు వేయాలని చెప్పిన ఎన్నికల కమిషన్ తర్వాత తాత్సారం చేస్తోంది….

పోలింగ్ సిబ్బందిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉన్నారు. ఫాం 12 ద్వారా పోలింగ్ సిబ్బంది ఓటు కోసం దరఖాస్తున్నా,తమకు పోస్టల్ బ్యాలెట్ అందలేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారని….

గతంలో ఉద్యోగులకు నేరుగా ఇంటికి పోస్టులో పోస్టల్ బ్యాలెట్ వచ్చేది. ఈ సారి పోలింగ్ శిక్షణ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఇస్తామని చెప్పి అక్కడ ఇవ్వలేదని ప్రభుత్వ ఉద్యోగులు చెప్పారని. పోస్టల్ బ్యాలెట్ల జాప్యంపై రిటర్నింగ్ అధికారులకు,జిల్లా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని ఉద్యోగులు వాపోతున్నారని….

తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల పోస్టల్ బ్యాలెట్లు ఉండగా అధికారులు కావాలని సమన్వయ లోపంతో ఇంకా పంపించకుండా జాప్యం చేస్తున్నారని పోలింగ్ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ నెల 25వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్లు పంపించాల్సి ఉన్నా ఇంకా అందలేదు…..

ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈసారి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన రైతుల ఓటు ద్వారా బుద్ధి చెబుతారని భయంతోనే ఈ రకంగా కొత్త నాటకాలకు తేరాలెపారని…

ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వాలు కూడా నిలబడలేదని…దేశంలో, రాష్ట్రంలో బీజేపీ,బిఆర్ఎస్ ప్రభుత్వాలకు కూడా నూకల చెల్లాయని ఆయన మాట్లాడారు…

Whatsapp Image 2023 11 25 At 6.48.56 Pm

Related Posts

You cannot copy content of this page