SAKSHITHA NEWS

ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం కోట్లాడే వారిపై కేసులు ఉంటాయని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పామెన భీమ్ భరత్ అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాలను ఓటర్లకు వివరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కాశెట్టి మోహన్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం కోట్లాడే వారిపై కేసులు ఉంటాయని, తనపై 11 కేసుల్లో శిక్ష పడ్డ కేసులు లేవని తెలిపారు.

నాపై కేసులున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం చేయడం సిగ్గుచేటాన్నారు. రాజకీయంగా ఎదుర్కొవాలని, ప్రజలను మెప్పించి ఓట్లు అడగాలని సూచించారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ది చెప్పుకుని ఓట్లు అడిగితే బాగుంటుందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ హయంలో టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్న కాలె యాదయ్య టికెట్లు, లడ్డూలు, కంది పప్పు అమ్ముకున్న కేసులున్నాయని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి వెంచర్లో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు విల్లాలు ఉన్నాయన్నారు. సైకిల్ మోటర్ లేని వ్యక్తి విమానం కొనేస్థాయికి ఎదిగాడని తెలిపారు. చేసిన పనులు చెప్పుకుంటూ ఓట్లు అడగాలని ఇతరులపై కేసులున్నాయని చెప్పుకుని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఉదయ్ మోహన్ రెడ్డి, సీనియర్ నాయకుడు సత్యనారాయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు వై ప్రకాష్, నాయకులు శశికాంత్, ప్రవీణ్, సర్తాజ్, షరూ, కృష్ణారెడ్డి, రామకృష్ణ ఉన్నారు.

Whatsapp Image 2023 11 22 At 5.56.48 Pm

SAKSHITHA NEWS