కాంగ్రెస్ లో భారీగా చేరికలు
కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన : కాట శ్రీనివాస్ గౌడ్
సాక్షిత : పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది, రోజురోజుకు కాంగ్రెస్ లో చేరికల సంఖ్య భారీగా పెరుగుతుంది. పటాన్ చెరు మండలం క్యాసారం గ్రామం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు రాజేష్ గౌడ్ వారి బృందం, వినాయక యూత్, అంబేద్కర్ యూత్, ఎస్ ఆర్ పి ఎస్ యువసేన సభ్యులు మరియు కులాలకు అతీతంగా అందరూ తమ మద్దతును తెలుపుతూ 150 మంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాట శ్రీనివాస్ గౌడ్ సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కుటుంబం మాత్రమే అన్ని రకాలుగా లబ్ది పొందిందని, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదని అన్నారు.
రాష్ట్ర ప్రజానికమంతా మీరు చెప్పే మాయమాటలు నమ్మి మరోసారి మోసపోరని మార్పు మొదలైంది రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. నవంబర్ 30 వ తారీకు నాడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని, ప్రతి మహిళకు నెలకు 2500 ఇస్తామని, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, రైతు కూలీలకు మరియు భూమి లేని రైతులకు సైతం రైతు భీమా పథకం, ప్రజల సంక్షేమం కోసం అందించే పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు.