కారు స్పీడ్ కు తట్టుకోలేక ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నారు అని పట్టుమని నెల రోజుల కూడా ఎలక్షన్లు లేవు ఇప్పటికీ ప్రతిపక్షాలు అభ్యర్ధులు ఏ పార్టీలో ఎవరో అభ్యర్థినీ పరిస్థితి అని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు అన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు , కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ తో కలిసి ఓల్డ్ బోయినపల్లిలోని వివిధ కాలనీల అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం కాలనీలలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బోయిన్పల్లిలోని అనేక అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని అలాగే వారి వారి కాలనీలకు జరిగిన అభివృద్ధి పనులు పై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా సమతానగర్ ,శంకర్ ఎంక్లేవ్ ఒకప్పుడు డ్రైనేజ్ ,రోడ్లు సమస్యలతో అనేక ఇబ్బందులు పడే వారమని కానీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వాటికి శాశ్వత పరిష్కారం చూపారని గుర్తు చేశారు ఇదే సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ బాలానగర్ ఫ్లైఓవర్ మరియు డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించారని అందుకునే ఈసారి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావునీ అఖండ మెజారిటీతో గెలిపిస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.ప్రచారంలో మహిళలు బతుకమ్మలతో సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బోయిన్పల్లి డివిజన్లో రోడ్లు డ్రైనేజీలు మంచినీటి సమస్యలు లేకుండా పరిష్కరించామని అంతేకాకుండా బోయిన్ చెరువు ద్వారా పక్కనే ఉన్న కాలనీలకు దోమలతో ఇబ్బందులు పడుతుంటే మంత్రి కేటీఆర్ సహకారంతో కోట్ల రూపాయలతో బోన్ చెరువుని అభివృద్ధి చేసి దోమల సమస్యలు రాకుండా నిర్మూలన చేశామని టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు అన్నారు. జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ మహానగరం రూపురేఖలు మారాయని 70 ఏళ్లుగా పరిష్కారం కానీ పనులు పదేళ్ల కాలంలో చేసుకున్నామని వేరే పార్టీలకు మనం అధికారం అప్పగిస్తే కులాలు, మతాలు అంటూ కుమ్ములాటలతో సరిపోతదే కానీ అభివృద్ధి గురించి పట్టించుకునే నాధుడు ఉండడని అందుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ నుఆ ఖండ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.