మేనిఫెస్టోను ప్రజలకు వివరించి ముచ్చటగా మూడవసారి బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం : ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
126-జగద్గిరిగుట్ట ఎం.కె.ఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ మరియు కుత్బుల్లాపూర్ ఎన్నికల ఇంచార్జ్ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
సంక్షేమం, సుపరిపాలనతో చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన వంటి అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరూ ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం ముచ్చటగా మూడవసారి విజయకేతనం ఎగరవేసేందుకు రూపొందించిన మేనిఫెస్టోను నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంక్షేమాన్ని మరిచి వారి సంక్షేమం కోసమే పనిచేశాయని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం దేశ తలసరి ఆదాయాన్ని మించిన ఆదాయంతో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని ఇది మింగుడు పడని ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధి ప్రదాత కెసిఆర్ పై, బిఆర్ఎస్ పార్టీపై విషం చిమ్ముతూ విద్వేషాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
ఇలాంటి నాయకుల పట్ల ప్రజలను జాగృతం చేస్తూ నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి బిఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కే.జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్రా అశోక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, మారయ్య, వేణు యాదవ్, బాబు గౌడ్, జైహింద్, అజ్రత్ అలీ, దాసు, విట్టల్, ఆజామ్, సాజిద్, పాపిరెడ్డి, వెంకట్ రెడ్డి, మహిళ నాయకురాలు ఇందిరాగౌడ్, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.