SAKSHITHA NEWS

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళ హారతులతో ప్రభుత్వ విప్ గాంధీ కి అపూర్వ స్వాగతం పలికిన మహిళ సోదరీమణులు, అడుగడుగునా నీరాజనం*

  • మంచి పనులెన్నో చేసాం. ఆశీర్వదించండి
  • ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గా గాంధీ ని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం కాలనీ వాసులు *
    ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇస్తాం*
    రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ దే హైట్రిక్ విజయం .
    శేరిలింగంపల్లి లో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం
    *ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ *
    ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ లో గల తుల్జా భవాణి అమ్మ వారి దేవాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తో కలిసి ప్రత్యేక పూజలు చేసి ఇంటింటి ప్రచారం చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ
ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో 9 వేల కోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అభివృద్ధి చేశామని,

రాబోయే ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ కి శ్రీరామ రక్ష అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిది ఏండ్లలో చేసిన అభివృద్ధి ,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. అత్యధిక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం అని ఈ విజయం ను ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇస్తామని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.


అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి తోడ్పడే విధంగా మ్యానిఫెస్టో ఉంది అని , సబ్బండ వర్గాల ప్రజలకు ఉపయోగంగా ఉంది అని, రాబోయే ఎన్నికల్లో విజయం తధ్యం అని,బీఆర్ఎస్ పార్టీ హైట్రిక్ విజయం సాధిస్తుంది అని, ప్రతిపక్షాలకు ఊహ కందని విధంగా రూపొందించడం జరిగినది అని, ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని, రైతు బంధావుడు, మహిళల పక్షపాతి అని, ఈ మ్యానిఫెస్టో ప్రజలకు మరింతగా చేరువయ్యేలా ఉంది అని ,సంక్షేమం , అభివృద్ధి సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అని, అందరికి సన్న బియ్యం ,అసరా పెన్షన్ల పెంపు,దివ్యాంగుల పెన్షన్ పెంపు,400 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మహిళలకు పెద్ద ఉపశమనం అని, ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి 15 లక్షల పెంపు చేయడం గొప్ప విషయం అని ,లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు , అర్హులైన పేద మహిళలదరికి ప్రతి నెల 3,000 రూపాయలు జీవన భృతి ని అందించడం గొప్ప విషయం అని ,రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్ల కాలంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ఏం చేయబోతున్నామని పూర్తి ప్రణాళికను వివరించారు అన్నారు.

కేసీఆర్ బీమా పేరుతో కొత్త స్కీమ్ అమలు చేసి ప్రజలందరికీ రూ.5 లక్షల చొప్పున కేసీఆర్ బీమా, తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం, ఆసరా పింఛన్ కు దశల వారీగా నెలకు రూ.5 వేలకు పెంపు వంటి పలు కీలక హామీలు ప్రకటించిన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలియచేసారు. దళిత బంధు, రైతు బంధు కొనసాగించడం, మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్ పెంచడం, మైనార్టీలకు జూ.కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయడం వంటి నిర్ణయాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

Whatsapp Image 2023 10 30 At 4.28.01 Pm

SAKSHITHA NEWS