చందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశరయ్య కాలనీ లో Masna BHEL అపార్ట్మెంట్స్, దీప్తి శ్రీ నగర్, సురక్ష ఎనక్లేవ్, చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద, PJR స్టేడియం వద్ద మరియు పలు కాలనీలో రూ.3 కోట్ల 6 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు మరియు మంజీర మంచినీటి పైప్ లైన్ నిర్మాణం పనులకు, మ్యాన్ హోల్స్ పునరుద్ధరణ నిర్మాణ పనులకు గౌరవ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు మరియు జలమండలి అధికారులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ గారు మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మెరకు మరియు మా కార్పొరేటర్లు, మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ కి ఒక కిలో మిటర్ (1Km) మేర చొప్పున భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులు మంజూరి అయినవి అని దానిలో భాగంగా ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు,అత్యవసరం ఉన్న చోట , నిత్యం పొంగుతున్న ప్రాంతలలోప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ గారు తెలియచేశారు. ప్రజలకు స్వచ్ఛమైన మంజీర నీరు అందించడమే ధ్యేయంగా ప్రతి కాలనీ కి మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన త్రాగు నీరు అందిస్తున్నాం అని ప్రభుత్వ విప్ గాంధీ గారు తెలియచేసారు . ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ,కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు. ఎన్నో ఏండ్ల సమస్య నేటి తో తిరునని, అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, UGD వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ గారు చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ గారు అధికారులను ఆదేశించడం జరిగినది , నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ,నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని, అదేవిధంగాసంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కెసిఆర్ గారి మార్గదర్శకం లో గౌరవ మంత్రివర్యులు శ్రీ KTR గార్ల సహకారం తో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి
ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు.
మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి కళల ప్రాజెక్టు అయిన మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన మంచి నీరు అందించడమే ప్రభుత్వ ద్యేయం అని, ఎన్నో ఏండ్ల మంచి సమస్య నేటి సమస్య తిరినది అని ,అసంపూర్తిగా మిగిలిపోయిన మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులు ప్రారంభించుకోవడం ద్వారా కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గాంధీ గారికి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేయడం జరిగినది ,వాటర్ వర్క్స్ బోర్డ్ నిధుల ద్వార మంజూరు అయిన నిధులతో చేపడుతున్న మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని ,ఎన్నో సంవత్సరాల నుండి నెలకొన్న సమస్య నేటి తో తీరునని కాలనీ వాసుల కోరిక మేరకు పాత మంచి నీటి పైప్ లైన్ స్థానంలో కొత్త పైప్ లైన్ వేయటం జరిగినదిఅని,ఎన్నో ఏండ్ల కలుషిత నీటి సమస్యనుండి నేటి తో విముక్తి లభించింది అని ఇకనుండి సురక్షిత మంచినీరు ఇవ్వడం జరుగుతుందని కాలనీ వాసుల సమస్య నేటి నుడి తీరనుందని ఎమ్మెల్యే గారు చెప్పటం జరిగినది.అదేవిధంగా అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెచ్చిన కార్యక్రమం అని, నెలకు 20,000 ల లీటర్ల ఉచిత మంచి నీటి పథకం ద్వారా అర్హులైన వినియోగదారులకు చేరువయ్యేలా చేసి లబ్ది పొందేలా చూడలని, ప్రతి ఇంటింటికి తీసుకువెళ్లాలని , ప్రతి ఒక్కరికి విస్తృతంగా అవగాహన కలిపించాలని, పేదవాడలలో నివసించే ప్రతి ఒక్క వినియోగదారునికి ఉచిత నీటి సరఫరా పథకం లాభాలను అందించాలని, అదేవిదంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటి నల్ల కనెక్షన్ ద్వారా నీటి సరఫరా చేపట్టడం జరుగుతుందని మరియు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచి నీటి ని ఇవ్వడం జరుగుతుందని ,మంచి నీటి సమస్య తలెత్తకుండా పవర్ బోర్లు ద్వారా కూడా సరఫరా చేస్తున్నామని . నియోజకవర్గం లో 18 రిజర్వాయర్ లు నిర్మాణం చేసుకున్నామని .ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ,మరియు నియోజకవర్గం లో పూర్తి స్థాయిలో మంచినీటిని అందిస్తామని చెప్పడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ గారు తెలియచేసారు.
శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :
మంజూరైన అభివృధి పనుల వివరాలు…
- Masana BHEL కాలనీలో రూ. 39:00 ముప్పై తొమ్మిది లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పనులకు
- దీప్తి శ్రీ నగర్ కాలనీలో రూ. 91:00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణ పనులకు.
- సురక్ష ఎనక్లేవ్ కాలనీలో రూ. 85 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణం పనులకు
- చందానగర్ PJR స్టేడియం వద్ద రూ. 85 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే UGD నిర్మాణం పనులకు
- చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద రూ.6 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే మ్యాన్ హోల్స్ పునరుద్ధరణ నిర్మాణం పనులకు
పైన పేర్కొన్న UGD పనులకు, మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం పనులకు, మ్యాన్ హోల్స్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు GM రాజశేఖర్, DGM నాగప్రియ, మేనేజర్లు సుబ్రమణ్యం, పూర్ణేశ్వరి, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ఉద్యమకారులు,బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.