SAKSHITHA NEWS

బిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలకు ఆకర్షితులై గులాబీ కండువా కప్పుకున్న 126 జగద్గిరిగట్ట డివిజన్ బిజెపి ఎస్సీ మహిళా అధ్యక్షురాలు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ కి చెందిని బిజెపి ఎస్ సి మహిళా అధ్యక్షురాలు సునీత వారి బృందం లలిత, పుష్ప, సంపూర్ణ, మీనా, భాస్కర్, కిరణ్ బాబు, వినోద్, బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎమ్మేల్యే కె.పి.వివేకానంద్ నివాస కార్యాలయం వద్ద కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ర్టానికి, దేశానికి శరణ్యమన్నారు. కేసీఆర్‌ అభివృద్ధి పితామహుడని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో అగ్రగామిగా నిలిపిన దార్శనిక పాలకుడని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని తెలిపారు, బిఅర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు.


SAKSHITHA NEWS