SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులకు సారె గా అందించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాం నరేష్ నగర్ లో లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను పంపిణి చేసిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .*

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ బతుకమ్మ పర్వదినం సందర్భంగా ఆడపడుచులకు సారెగా ఉచితంగా చీరలను అందచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కి హైదర్ నగర్ డివిజన్ అడపడచుల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లోని మహిళలు ముఖ్యంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం మహిళల గౌరవార్థం ఉచితంగా చీరల పంపిణి చేయడం జరిగింది అని ఈ బహుమతి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ  యొక్క చీరల పంపిణీ హైదర్ నగర్ డివిజన్ లో పేద మహిళలకు అందించడం చాలా ఆనందం గా ఉంది అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియచేసారు బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ సంప్రదాయాన్ని చాటి, చూపిన ఘనత మన ప్రభుత్వం కే దక్కిందని అని తెలియచేసారు.

అదేవిధంగా దశాబ్దాలుగా దగాపడ్డ వస్త్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం జీవంపోసింది అని బతుకమ్మ పండుగ పూట సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన రాష్ట్ర సర్కారు..బతుకమ్మ పర్వదినం సందర్భంగా ఆడబిడ్డలకు పుట్టింటి సారెను అందిస్తూ మురిపిస్తున్నది. ఇందుకు సంబంధించిన చీరల తయారీని అప్పగించి నేత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపుతున్నది అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్, కాలనీ వాసులు నక్క శ్రీనివాస్, వెంకటయ్య యాదవ్, సత్యనారాయణ, నక్క సురేష్, మహేందర్ రెడ్డి, సుదర్శన్ రావు, ఎల్లా స్వామి, రాజి రెడ్డి, బసవ రాజు, రాంబాబు, దామోదర్, వెంకటయ్య, బ్రహ్మయ్య, మహిళలు విమల, స్వప్న, దుర్గ, సంధ్య, సుధా, లక్ష్మీ, లావణ్య, కమ్యూనిటీ ఆర్గనైజర్ ముస్తఫ్ఫా తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 10 07 at 4.14.23 PM

SAKSHITHA NEWS