SAKSHITHA NEWS

కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీలో భాగంగా బౌరంపేట పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలిన బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి జరిగింది

…..

సాక్షిత : నాయకులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద గుడ్డు పొదిగిన కాడి నుండి చేప పిల్లల పెంపకం చెరువులో సప్లై చేసే వరకు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పంపిణీ చేస్తుంది కావున ముదిరాజ్ సంఘ సభ్యులు మత్స్యకార సంఘ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క వృత్తిలో దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మత్స్యశాఖ అధికారి బి పూర్ణిమ బౌరంపేట ముదిరాజ్ సంఘం మరియు మత్స్య సహకార సంఘం సభ్యులు పిట్ల లక్ష్మణ్ దూలపల్లి సత్యనారాయణ మన్నె బాలరాజు కట్ట మైసమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు సాయికృష్ణ చింత బిక్షపతి గడిల మల్లేష శ్రీకాంత్ చింటూ రవి శంకర్ సురేందర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2023 10 07 at 2.35.50 PM

SAKSHITHA NEWS