హమాలీ భవన నిర్మాణానికి స్థలం మంజూరుచేయించినందుకు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని సన్మానించిన హమాలీ సంక్షేమ సంఘం సభ్యులు ..
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజవర్గం పరిధిలోని హమాలీ వర్కర్స్ సంక్షేమ సంఘం సభ్యులు తమకు భవన నిర్మాణానికి స్థలం మంజూరుచేయించినందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో పూవులమల్తో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమా మహేష్, లక్ష్మణ్, స్వామి, దేవదానం, ఎమ్.శ్రీను, నాగయ్య, కరుణాకర్, సంక్షేమ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.