SAKSHITHA NEWS

కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ ఉద్యోగులు

అశ్వారావుపేట (సాక్షిత న్యూస్) : అంగన్వాడి ఉద్యోగులను
పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెన్షన్ పెంపు, గ్రాడ్యుటి ఇతర సమస్యలు పరిష్కరించాలని, అశ్వారావుపేట రింగ్ రోడ్డు లో అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 15వ రోజుకు చేరుకుంది. 15వ రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడి ఉద్యోగులు అశ్వారావుపేట రింగ్ రోడ్డు సెంటర్లో కళ్లకు గంతలు కట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కళ్ళుండి మా సమస్యలను చూడటం లేదని అందుకే కళ్లకు గంతలతో నిరసన వ్యక్తం చేస్తున్నామని అంగన్వాడి ఉద్యోగులు తెలిపారు.

ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులుగా నిరవధికంగా సమ్మె చేస్తున్నా కనీసం స్పందించడం లేదని, సమ్మెను పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని అంగన్వాడీ ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగుల పట్ల మానవీయ కోణంలో ఆలోచించి సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని, గ్రాడ్యుటి అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంగన్వాడి టీచర్లకు 10 లక్షలు, హెల్పర్లకు 5 లక్షలు చెల్లించాలని, ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షలు చెల్లించాలని, ఎస్ఎస్సి అర్హత ఉన్న హెల్పర్లకు ప్రమోషన్స్ సౌకర్యం కల్పించాలని, మినీ అంగన్వాడి సెంటర్లను ను మెయిన్ సెంటర్లుగా సంవత్సరాల రేషన్ షాప్ రవాణా చార్జీలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉష విజయ, నాగలక్ష్మి, భాగ్యలక్ష్మి, ఆర్కేఎం లక్ష్మి, శ్రీ వాణి, ప్రవీణ, వెంకటరమణ, కుమారి, ప్రభావతి, లక్ష్మీ, సరోజినీ, అంబుజ్జి, సావిత్రి, వేదవతి, రాణి, ఆదిలక్ష్మి, లక్ష్మి, కుమారి, నర్సమ్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 09 26 at 4.29.57 PM

SAKSHITHA NEWS