SAKSHITHA NEWS

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఖాజా నగర్ లో పదమూడు లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.

రోడ్డు మీద నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో సీసీ రోడ్డు నిర్మించాలని సంబంధిత అధికారులకు మరియు కాంట్రాక్టర్ కు తెలియచేసారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెట్టి కాలనీని సుందరంగా తీర్చిదిద్దుకోవాలని కాలనీ ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, భాస్కర్ రెడ్డి, కైసర్, ఎండి.సుల్తాన్, షకీల్ మున్నా, పద్మయ్య,అబ్దుల్ సలామ్, ఎండి.మహమూద్, గౌస్, ఇస్మాయిల్, అక్బర్, ఫిరోజ్, షఫీ, AE శ్రావణి, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 09 26 at 2.15.20 PM

SAKSHITHA NEWS