బీఆర్ఎస్లో చేరిన లెనిన్ నగర్ కి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులూ, కార్యకర్తలు …
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని లెనిన్ నగర్ కు చెందిన బీజేపి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో ఎస్ రాంరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ర్టానికి, దేశానికి శరణ్యమన్నారు. కేసీఆర్ అభివృద్ధి పితామహుడని, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో అగ్రగామిగా నిలిపిన దార్శనిక పాలకుడని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీలో చేరిన ప్రతీ ఒక్కరూ బీఆర్ఎస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అందించేలా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులూ కస్తూరి బాలరాజ్, కమలాకర్, వీ సాంబా రాజు,జె తారాసింగ్, బస్వరాజు,తెలంగాణ సాయి, చిన్న చౌదరి, కె ప్రవీణ్, జి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.