SAKSHITHA NEWS

గద్వాలలో డీకే అరుణ కామెంట్స్

తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్ల వారికి పెన్షన్ ఇస్తానన్న కేసీఆర్ హామీ నేటికీ నెరవేరలేదు

మునుగోడులో లబ్ది పొందేందుకు పెన్షన్ ల హామీని ప్రకటించాడు

జిల్లాలో 16,123 వితంతు పెన్సన్స్ మంజూరు అయినట్లు అధికారులు ప్రకటించారు.ఇందులో అర్హులైన లబ్ధిదారులను కాకుండా 40 శాతం వరకు అనర్హులను ఎంపిక చేశారు.

టిఆర్ఎస్ అనుకూలురలను ఎంపిక చేశారు.జిల్లా కలెక్టర్ పెన్షన్ లపై విచారణ జరపాలి.

రాష్ట్రంలో ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం చేయకుండా కేవలం రాజకీయ లబ్దికోసం ఇతర రాష్ట్రాలలో ఆర్థిక సహాయం చేస్తున్నాడు.

తెలంగాణాను అప్పుల తెలంగాణగా మార్చి ఉద్యోగులకు,పెన్షన్ దారులకు,మధ్యాహ్న భోజన పథక ఏజెన్సీలకు బిల్లులు జాప్యం లేకుండా చెల్లించాలి.


SAKSHITHA NEWS