రంగారెడ్డి జిల్లా..
ఆరు గ్యారెంటీల్లో భాగంగా, మరో రెండు పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చట్టనుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఇవాళ ప్రారంభించనున్నారు..
చేవెళ్లలో ఈ రెండు పథకాలు ప్రారంభించాలని భావించినా, ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో సచివాలయంలో మొదలు పెట్టాలని నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన తెల్లరేషన్ కార్డుదారులకు ఈ రెండు పథకాలను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం జరిగే సభలో పార్టీ అగ్రనేత ప్రియాంక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు..
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా, మంగళవారం నుంచి మరో రెండు హామీలను అమలు చేసేందుకు నడుంబిగించింది. ఇందుకోసం ఆహ్వాన పత్రికను కూడా ముద్రించింది. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, అర్హులైన ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన పత్రికను ముద్రించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, విశిష్ట అతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు హాజరవుతారు..
ఈ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కాలేజీలో జరుగనుందని ఆహ్వాన పత్రికలో ముద్రించారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన లేఖలను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నట్టు ఆ పత్రికలో పేర్కొంది..