రోడ్డు ప్రమాదానికి గురై ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టుకి ఆర్థిక చేయూత అందించిన సంతనూతలపాడు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్.
చీమకుర్తి మండల సూర్య దినపత్రిక విలేఖరి M V రమణ ఇటీవల రోడ్డు ప్రమాదం గురై చికిత్స పొందుతున్నారు. APUWJ రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు చేతుల మీదగా వైద్య ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయల ఆర్థిక సహాయం సోమవారం అందించడం జరిగింది
ఈ సందర్భంగా I V సుబ్బారావు మాట్లాడుతూ కష్టంలో ఉన్న సాటి విలేకరు ఇబ్బందులను గమనించి సంతనూతలపాడు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయం అన్నారు
పేద జర్నలిస్టుల సమస్యల కోసం తన వంతుగా కృషి చేస్తున్నానని I V సుబ్బారావు అన్నారు. ఈ కార్యక్రమంలో APUWJ జిల్లా కార్యదర్శి దాసరి కనకయ్య, సంతనూతలపాడు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు గొల్లపూడి శ్రీహరి, ఉపాధ్యక్షులు బొడ్డపాటి వాసు, ప్రధాన కార్యదర్శి బెజవాడ హరి, కార్యదర్శి దొంతు సుధాకర్, కోశాధికారి పల్లపాటి చంద్ర, సభ్యులు దావులూరి అనిల్, ఉన్నం మురళి, చల్ల మహేంద్ర, వల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు
చీమకుర్తి సూర్య రిపోర్టర్ రమణఅన్న కు 50 వేల ఆర్థిక సహాయం
Related Posts
ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు
SAKSHITHA NEWS అమరావతి : ఏపీలో అంగన్వాడీలకి రూ.52.68 కోట్లు ఏపీ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయాలకు రూ.52.68 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖపై బుధవారం ఆమె సమీక్షించారు.…
కలెక్టర్ తో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ
SAKSHITHA NEWS సాక్షిత పల్నాడు జిల్లా, గురజాల. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా కలెక్టర్ గారితో కలిసి స్థల పరీశీలన చేసిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాస రావు ఐపీఎస్ గారు 🔰పల్నాడు…