సర్వేపల్లి లో ఖాళీ అవుతున్న టిడిపి”
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 50 కుటుంబాలు
సాక్షిత నెల్లూరు జిల్లా:సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, బ్రహ్మదేవి గ్రామపంచాయతీ పరిధిలో 3వరోజు “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా వెడిచెర్లమిట్ట ఈదులవారిపాళెం గ్రామాలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి .
వెడిచెర్లమిట్ట గ్రామం నుండి తెలుగుదేశం పార్టీని వీడి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి చేరిన 50 కుటుంబాలు.
ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ..
జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల ఆకర్షితులై చాలామంది ప్రజలు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి ముందుకు వస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ఆలోచన చేసి, ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు.
చరిత్రలో ఎవరు ఇవ్వలేని విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
ప్రజల అభివృద్ధి, గ్రామాలలో మౌలిక సదుపాయాలను తెలుసుకొని ఏర్పాటు చేస్తున్నాం.
ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయో లేవో తెలుసుకోవడానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి, ప్రజల వద్దకు వెళ్తున్నాం.
గ్రామాలలో ప్రజలలో వస్తున్న స్పందన చూస్తేనే, జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో అర్థమవుతుంది.
ముత్తుకూరు మండల ప్రజల చిరకాల కోరిక నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీని గతంలో అధికారంలోకి వచ్చిన నాయకులు ఆలోచన చేసిన పరిస్థితి లేదు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం, 2019 ఎన్నికల నాటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి నాన్ ఫిషర్ మెన్ ప్యాకేజీ అందించాం.
గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం.
గ్రామాలలో మట్టి రోడ్డు అనేది కనిపించకుండా, కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి, అవసరమైన అన్నిచోట్ల సిమెంట్ రోడ్డు నిర్మించాం.
రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధరకంటే ఎక్కువ రేటు పలకడంతో, తెలుగుదేశం నాయకులు కుమిలి కుమిలి ఏడుస్తున్నారు.
రైతుల సంక్షేమాన్ని కానీ, సౌభాగ్యానికి కానీ తెలుగుదేశం నాయకులు ఏనాడు కోరుకోరు.
రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలిచింది.
కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు, గ్రామస్తులకు ధన్యవాదాలు.