ఏపీలోని ఆసుపత్రుల్లో 26,263 ఉద్యోగాలు ఖాళీ!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాల పరిధిలో వైద్యులు, పారామెడికల్ ఉద్యోగాల ఖాళీలు 25.97 శాతం ఉన్నాయి. నిర్ణీత 1,01,125 ఉద్యోగాలలో 3,114 వైద్యులు, 23,149 పారామెడికల్ ఉద్యోగులు లేరు. వీటిలోని ఖాళీలను అవసరాల మేరకే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రాధాన్య క్రమంలో తొలుత ఏడెనిమిది వేల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోనుంది….