గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
సాక్షిత ; కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం 125 డివిజన్ కైసర్ నగర్ కు చెందిన బిజెపి కార్యకర్తలు 200 మంది బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమక్షంలో చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకుడు షేక్ ఆబిద్ ఆధ్వర్యంలో దెరగల్ శ్యామ్ మరియు ముత్తు స్వామి బృందం బిజెపి నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువాలు కప్పి ఎమ్మెల్యే వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సారధ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కష్టపడిన ప్రతీ కార్యకర్తకు తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. ప్రభుత్వ పథకాలను పార్టీలో చేరిన కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బిజెపి నుండి 200 మంది బీఆర్ఎస్ లో చేరిక.
Related Posts
పల్లెల నుండి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు
SAKSHITHA NEWS పల్లెల నుండి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ టోర్నమెంట్ ను నిర్వహిస్తోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తెలిపారు.……………………………………సాక్షిత : జనగామ జిల్లా కేంద్రంలోని మినీ…
124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 1 లో ఉన్న పల్లె దవాఖాన
SAKSHITHA NEWS 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 1 లో ఉన్న పల్లె దవాఖాన ను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తనిఖీ చేసి, వారు అందిస్తున్న వైద్య సేవల ప్రక్రియను పరిశీలించడం జరిగింది.…