
బాపట్ల జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాహనాలను సోదాలు చేశారు. అయితే కారులో తరలిస్తున్న రూ.2.25 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు.
ప్రొద్దుటూరు నుంచి విజయవాడకు ఈ నగదును తీసుకెళ్తున్నట్లు డ్రైవర్ చెప్పారు. అయితే సరైన ఆధారాలు లేని కారణంగా నగదును పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా నగదును తరలించొద్దని, తనిఖీల సమయంలో వివరణ సరిగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు చూపించకపోతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.
