SAKSHITHA NEWS

పదవ తరగతి తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి.

  • జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;

పదవ తరగతి తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శనివారం నగరంలోని జమ్మిబండ ప్రాంతంలో వున్న నారాయణ స్కూల్, జ్యోతి బాలమందిర్ హైస్కూలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న సరళిని ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కనీస మౌళిక సదుపాయాల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ తో లోనికి ఎవ్వరిని అనుమతించవద్దని, చీఫ్ సూపరింటెండెంట్ ల నుండి పరీక్షా విధుల్లో ఉన్న అందరిని, వైద్య శిబిర వైద్య సిబ్బందితో సహా ప్రతి ఒక్కరినీ తనిఖీలు చేసి అనుమతించాలన్నారు. కిటికీలు, ప్రహారి గోడ సరిగా లేనిచోట భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ అన్నారు.


SAKSHITHA NEWS