SAKSHITHA NEWS

10th Class Advance Supplementary Examinations to be Conducted Armed – Additional Collector Revenue No. Nagesh

జిల్లా లో
పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి – అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్
సాక్షిత వనపర్తి జూన్ 1 జిల్లాలో జూన్ 3 నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్ ఆదేశించారు.
శనివారం ఉదయం వనపర్తి లోని అనుస్ అకాడమి ఉన్నత పాఠశాల, చాణక్య ఉన్నత పాఠశాల ను సందర్శించారు. పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. బెంచీలు, సిటింగ్ అరేంజిమెంట్, సి.సి. కెమెరాలు, మరుగుదొడ్లు, తాగు నీరు వంటి మౌళిక వసతులను పరిశీలించారు.
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

epaper Sakshitha
Download app

10th Class Advance Supplementary Examinations to be Conducted Armed - Additional Collector Revenue No. Nagesh

SAKSHITHA NEWS