మే డే’ కానుకగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను నెలకు తలా 1,000 (వెయ్యి)

Spread the love

సాక్షిత : మే డే’ కానుకగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,06,474 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలను నెలకు తలా 1,000 (వెయ్యి) రూపాయల చొప్పున ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించిన శుభసందర్బంగా పారిశుధ్య కార్మికులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేస్తూ కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్ , శ్రీమతి మాధవరం రోజాదేవి రంగరావు , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కు పుష్పగుచం అందచేసి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది తల్లిదండ్రులతో సమానం అని , కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వారి సేవలు మన పరిసర ప్రాంతాలను ,కాలనీ లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతు,కాలనీ లలో ప్రశాంత వాతావరణం కల్పించుట కోసం పని చేస్తున్నారు అని, ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రంగా చేస్తూ నిత్య శ్రామికులు గా పనిచేస్తున్నారు అని , పరిసరాల పరిశుభ్రతే ధ్యేయంగా పనిచేస్తారు అని వారి సేవలను కొనియాడారు. అదేవిదంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ పారిశుధ్య కార్మికుల జీతాలు పెంచాడమే కాకుండా వారి ఆరోగ్యము కూడా మన బాధ్యత అని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు .మన ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు నిరంతరం పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. అదనపు వేతనం అందుకున్న కార్మికులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి మరియు ప్రభుత్వ విప్ గాంధీ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు.జిహెచ్ఎంసి, మెట్రో వాటర్ వర్క్స్ తో పాటు, రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలల్లో పనిచేస్తూ ప్రస్తుతం జీతం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులందరికీ నెల నెలా పెరిగిన వేయి రూపాయల వేతనం అదనంగా జీతంతో పాటు కలిపి అందుతుందని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.
అదేవిధంగా
‘సఫాయన్న నీకు సలాం అన్న’ అనే నినాదంతో పారిశుద్ధ్య కార్మికుల కృషిని, త్యాగాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుండి గుర్తిస్తూ వారి సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నదని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.
తెలంగాణ పల్లెలు, పట్టణాలు గుణాత్మక అభివృద్ధిని సాధించడంలో పారిశుద్ధ్య కార్మికుల శ్రమ గొప్పదన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన పల్లెలు, పట్టణాలకు అవార్డులు రావడం వెనుక వీరి కృషి దాగి ఉన్నదని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. పల్లెలు, పట్టణాల్లో నాటి, నేటి పరిస్థితులకు ఎంతో స్పష్టమైన తేడా ఉన్నదని గాంధీ అన్నారు. కార్మికుల కష్టసుఖాలను తెలుసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ వారి జీతాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వారికి అండగా నిలబడిందని అన్నారు. తద్వారా పారిశుద్ధ్య కార్మికులు కూడా అదే కృతజ్ఞత భావంతో మనస్ఫూర్తిగా పని చేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావడం పట్ల ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, నాయి నేని చంద్రకాంత్ రావు, చంద్రమోహన్ సాగర్, KN రాములు ,ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page