చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీ లో 1.75 ఒక కోటి డెబ్భై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపడుతున్న వరద నీటి కాల్వ నిర్మాణ పనులను కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి మరియు GHMC అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ .
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఇందిరా నగర్ కాలనీ లో నెలకొన్న ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తిరినది అని, మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం గా దిశగా అడుగులు వేస్తున్నాం అని ,కాలనీ ప్రజలకు వర్షాకాలంలో నెలకొన్న ఇబ్బందులు, వరద ముంపు వంటి సమస్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకొని నేడు వరద నీటి కాల్వ నిర్మాణం పనులు చేపట్టడం జరిగినది అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేశారు. ,అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తున్నామని, రాబోయే వర్షాకాలం ను దృష్టి లో పెట్టుకొని వరద నీటి కాల్వ నిర్మాణం పనులలో ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలనీ చెప్పడం జరిగినది. వరద నీటి కాల్వ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, గత వర్షాకాలంలో నాలా పొంగి ప్రవహించడం ద్వారా ఇండ్లలోకి నీరు ప్రవహించి ,పరిసరాలు నీటమునిగిన పరిస్థితి విదితమే దీనిని దృష్టిలో పెట్టుకొని మళ్లీ పునరావృతం కాకుండా పనులు చేపట్టామని ,నాలా లో పేరుకుపోయిన చెత్త, మట్టిని పూడిక తీత ద్వారా తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని అధికారులు తెలియచేసారు.
వరద నీటి కాల్వ విస్తరణ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని,వరద నీటి కాల్వ నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో రాజీ పడకుడదని పనుల లో వేగం పెంచాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.వరద నీటి కాల్వ నిర్మాణ పనుల పై పలు సూచనలు,సలహాలు ఇవ్వడం జరిగినది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతలు ,నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కల్గకుండా సన్నద్ధం కావాలని,ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముంపుకు గురికాకండా ముందస్తుగా తగు చర్యలు తీసుకోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, అదేవిదంగా GHMC అధికారులు సమన్వయం తో పని చేసి పనులలో పురోగతి సాధించాలని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో EE శ్రీకాంతిని DE దుర్గ ప్రసాద్, AE సంతోష్ రెడ్డి, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీనాయకులు అక్బర్ ఖాన్, నరేందర్ బల్లా, అంజద్ పాషా,సందీప్ రెడ్డి,ఇబ్రహీం,ఖాసీం,అశు, అజ్జు, రాహుల్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.