క్రీడా ప్రాంగణాలని వినియోగించుకోవాలి – జెడ్పీటీసీ

Spread the love

క్రీడా ప్రాంగణాలని వినియోగించుకోవాలి – జెడ్పీటీసీ

— వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో జడ్పిటిసి

చిట్యాల సాక్షిత

చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణంలో వేసవి హాకీ శిక్షణా శిబిరాన్ని ముగింపు కార్యక్రమంలో చిట్యాల జడ్పిటిసి సుంకరి ధనమ్మ యాదగిరి గౌడ్, చిట్యాల మండలం ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు పెద్దబోయిన సత్తయ్య యాదవ్ ఉరుమడ్ల గ్రామ సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్ రెడ్డి ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య గౌడ్ పాల్గొని వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులకు అల్పాహారం మరియు ఆట సామాగ్రి అందజేశారు. జడ్పిటిసి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ క్రీడా ప్రాంగణాలను వినియోగించుకొవాలని అన్నారు. ఎంపిటిసి సత్తయ్య మాట్లాడుతూ క్రీడల పట్ల మానసిక శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ఉన్నత స్థాయికి ఎదిగేలా క్రీడలు విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాకీ కోచ్ గంగపురపు రాము, వ్యాయామ ఉపాధ్యాయులు కొండ పరమేష్ వై శేఖర్, ఆర్ శ్రీనివాస్, ఏ బిక్షం , వి భాస్కర్, వి లింగ స్వామి యం శ్రీనివాస్ సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page