రంగస్థల సమాజాలు,పరిషత్ లను ప్రోత్సహించేందుకు రూ.5.00 లక్షల నగదు బహుమతి
•నాటక రంగ కళాకారులకు అందజేసే ఎన్.టి.ఆర్.రంగస్థల పురస్కారం కొనసాగుతుంది
•నంది నాటక అవార్డుల తుది ప్రదర్శనకు 38 నాటకాలు, నాటికల ఎంపిక
•నవంబరు చివర్లో తుది ఎంపికను గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహణ
•కళాకారులకు గుర్తింపు కార్డులు జారీకై ఈ నెల 15 నుండి ఆన్ లైన్ ధరఖ్తాసుకు అవకాశం
రాష్ట్ర ఫిల్ము, టివి మరియు థియేటర్ డవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి
అమరావతి, : తెలుగు నాటక రంగం ప్రోత్సాహానికి, అభివృద్దికి విశేషంగా కృషిచేస్తున్న రంగస్థల సమాజాలకు, పరిషత్ లకు ఈ ఏడాది నుండి వైఎస్సార్ రంగస్థల పురస్కారం క్రింద రూ.5.00 లక్షల నగదు బహుమతిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర పిల్ము, టివి మరియు థియేటర్ డవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి తెలిపారు. శుక్రవారం వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు