SAKSHITHA NEWS

బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి.

సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బీజేవైఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పవన్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ చేపట్టిన నమో నవమాత దాత సమ్మెళన లో కార్యక్రమంలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో యువత రాజకీయాల్లోకి రావాలని తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

18 సంవత్సరాలు దాటిన యువత మరియు విద్యార్థులు ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. యువత రాజకీయాలకు వచ్చినప్పుడే దేశం యొక్క కీర్తి ప్రతిష్ట పెంపొందించవచ్చు అని అన్నారు నరేంద్ర మోడీ గారు చేసే అభివృద్ధిని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిలు, వివిధ పదాధికారులు, యువమోచా నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 25 At 6.03.50 Pm

SAKSHITHA NEWS